దాదాభాయి నౌరోజీ (1825-1917);- తాటి కోల పద్మావతి

 భారతీయ రాజకీయ గురువుగా ఆర్థికవేత్తగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకడిగా చరిత్రపుటల్లో నిలిచిపోయిన మహనీయుడు. 19వ శతాబ్దంలో జన్మించిన గొప్ప వ్యక్తుల్లో ఒకడుగా బ్రిటిష్ వారి చేత భారతీయుల చేత మన్ననలు పొందిన ప్రజ్ఞాశీలి. ఈయన 18 25 లో ఒక పారసీ కుటుంబంలో జన్మించాడు. డిగ్రీ చదువుకొని లండన్ వెళ్ళాడు
. అక్కడ ఒక వ్యాపార వేత్తకు సహాయకుడిగా పని చేశాడు. అక్కడ నివసిస్తూ అక్కడున్న భారతీయులను ఏకం చేసి'ఇండియన్ సొసైటీ'ని స్థాపించాడు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన ఒకరిద్దరిలో ఈయన ఒకడు.
'గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా'గా పిలవబడే ఈయన భారతదేశం తిరిగి వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకడు అయ్యాడు. ఆయన స్వరాజ్యం కోసం పాటుపడడమే కాక ఎందరో ఎందరో విద్యావంతుల్ని ఆ సంస్థలో కలపడానికి తోడ్పడ్డాడు.
ఈయన కాంగ్రెస్ లో చేరినప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగుల సమస్త గానే ఉండేది. అంతేకాక వారి సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించడమే దాని ప్రధాన ఉద్దేశం. ఆయన 18 96 లో ఆ తర్వాత 1906లో దానికి అధ్యక్షత వహించి ఉద్యోగుల సమస్యలే కాకుండా స్వతంత్ర భారతదేశ వాంఛను వెల్లడించాడు. అతడి కార్యక్రమాలు తెలుసుకొని న్యాయస్థానానికి పిలిచి అక్కడ అతడిని కూర్చోమని ఆదేశించారు.
అయితే ఆయన స్వతంత్రం కోరినా వారితో ఎప్పుడూ సంబంధాలు కొనసాగించిన మేధావి.

కామెంట్‌లు