ప్రతిభామూర్తులు. బాల గంగాధర తిలక్. (1856-1920)- తాటి కోల పద్మావతి

 "స్వాతంత్రమే నా జన్మ హక్కు"అన్న మొదటి స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్. 18 56 లో మహారాష్ట్రలో జన్మించిన తిలక్ అసలు పేరు బస్వంత్ గంగాధర తిలక్. చిన్నతనం నుండి దేశభక్తి భావంతో విదేశీ పాలనను ద్వేషించేవాడు. 1879లో ఎల్ ఎల్ బి చదివి 18 81 లో మరాఠీలో కేసరి అనే పత్రికను నడిపాడు. అంతేకాక మరాఠా అనే ఇంగ్లీషు పత్రికను కూడా నడిపాడు. ఈయన ఆర్యన్, ఆర్కిటిక్ హోమ్ఇ ది వేదాస్ గ్రంథాల ద్వారా పాశ్చర్ దేశాలలో కూడా గుర్తింపు పొందారు. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆయన ఎంతో సేవ చేశారు. ఆయనను భారతీయ రాజకీయ అనిశ్చితకు తండ్రిగా పిలవబడ్డాడు. దానికి కారణం బ్రిటిష్ వారి పాలనేనని గట్టిగా వాదించాడు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు కారణం చెప్పమని అధికారులు కోరినప్పుడు తనను తాను సమర్ధించుకుంటే నాలుగు రోజులు సుదీర్ఘ ఉపన్యాసమిచ్చిన దేశభక్తుడు. 19 16 లో అనిబిసెంట్తో కలిసి స్వదేశీ పాలన కొరకు పోరాడి సరైన జవాబు లభించిన తర్వాత ఉద్యమాన్ని విరమించాడు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన 1908 లో ఆరు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. ఆ జైలులోనే ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశాడు. అతడు భారతీయ చరిత్ర, సంస్కృతులను గొప్పగా అర్థం చేసుకున్నాడు. 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకించాడు. ఆయన జీవితాంతం స్వాతంత్ర సాధనకు పోరాడి 1920లో పరమపదించిన గొప్ప దేశభక్తుడు.

కామెంట్‌లు