గోపాలకృష్ణ గోఖలే (1866-1955);- తాటి కోల పద్మావతి.

 జీవితాంతం ఈయనతో విభేదించిన తిలకు ఈయనను'భారతదేశ వజ్రంగా మహారాష్ట్ర మణిపూస"అని పేర్కొన్నాడు. ఈయన 18 86 లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని కో ల్ట ద్ లో జన్మించాడు. ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 18 84 లో ముంబైలో కళాశాల విద్యను అభ్యసించాడు. సోదరుడు విదేశాలకు వెళ్లి చదువు కొనసాగించమన్నా నిరాకరించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. ఆ తర్వాత రనడే ప్రభావాలకు లోనై భారతీయ ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేశాడు.
19 00లో ముంబై లెజిస్లేటివ్ సభ్యుడు ఫిరోజ్ మెహతాతో కలసి పనిచేశాడు. 1902లో వైస్రాయ్ కౌన్సిల్ కు ఎన్నుకోబడి ఆర్థిక బడ్జెట్ పై ఉపన్యసించి వాటిని విమర్శించాడు. గోఖలే సౌత్ ఆఫ్రికా లోని భారతీయుల కోసం కూడా పోరాడాడు. అప్పుడే ఆయనకు గాంధీజీతో పరిచయం ఏర్పడింది. గాంధీ శాంతియుత పోరాటాన్ని సమర్థించాడు.
ఆయన పనికిమాలిన పోరాటాలు కాక ప్రాచ్య పాశ్చాత్య నాగరికతలను సమన్వయం చేయాలని భావించాడు. గాంధీజీ ఈయనను తన రాజకీయ గురువుగా పేర్కొన్నాడు. ఈయన స్వతంత్ర భారతదేశంలో చూడటానికి ఎంతో ముందుగా 1915లోనే పరమపదించాడు.

కామెంట్‌లు