గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961);- తాటి కోల పద్మావతి

 ఉత్తరప్రదేశ్ లోని ఆల్మోరాలో జన్మించిన పంత్ ఓ ధనిక కుటుంబంలో 18 87 లో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం ఎక్కువ కాలం అలహాబాద్ లో జరిగింది. అలహాబాద్ లో జరిగింది. 19 0 9 లో బి ఏ, 1909లో లా చదివి పేరు, ధనమును సంపాదించాడు. గోఖలే, రనడే, దాదాభాయ్, మదన్మోహన్ల శాంతి ఉద్యమాలలో ప్రేరణ పొంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. అయితే అతడు ఉత్తరప్రదేశ్ కు మాత్రమే పరిమితమై అలహాబాద్ కేంద్రంగా శాంతి ఉద్యమాలు నిత్యం విదేశీ వస్తు బహిష్కరణ, శాంతి యాత్రలలో పాల్గొన్నారు. అలాంటి ఒక పాదయాత్రలో నెహ్రూ, విజయలక్ష్మి పండిట్ పాల్గొనగా బ్రిటిష్ పోలీసు గుర్రాలతో తొక్కించి లాఠీలకు పని చెప్పిన నెహ్రూ ని రక్షించడానికి కవచంగా నిలబడి తీవ్రమైన దెబ్బలు తిని ఆ తర్వాత జీవిత కాలంలో అవే గాయాలై భాధలు పడ్డాడు.
ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు. స్వతంత్రం రాకముందే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆయన పరిపాలన దక్షత బయటపడి స్వతంత్రానంతరం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత నెహ్రూ కేంద్ర ప్రభుత్వంలో హోం శాఖను నిర్వహించాడు. 1955 లోనే ఈయనకు'భారతరత్న'పురస్కారం లభించింది. 1961 లో ఈయన మరణించాడు.

కామెంట్‌లు