ప్రతిభా మూర్తి. అడవి బాపిరాజు (1895-1952)- తాటి కోల పద్మావతి

 చారిత్రక నవలా రచయిత, కవి, కథకుడు, అధ్యాపకుడు. అన్ని వెరసి అడవి బాపిరాజు.
'బాపిబావ'అందరిచే ముద్దుగా పిలిపించుకున్న వీరు 18 95 లో భీమవరంలో జన్మించారు. కవి గాయకులు అయిన ఆస్వాల్డ్ కూల్ ట్రే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉండగా ఈ తెలుగు రత్నాన్ని సానబెట్టారు. కూల్డ్రే సహాయంతో ఆంగ్ల సాహిత్యాన్ని మదించారు. భారతదేశమంతా తిరిగి ఆలయ శిల్పాలను గుహ కుడ్య చిత్రాలను దర్శించారు. భైరవ ప్రేరణతో తొలకరి అనే గేయ సంపుటాన్ని ప్రకటించారు. దేశభక్తి వల్ల ఒక ఏడు జైలు జీవితం అనుభవించారు. కారాగారంలో ఉండగా శాతవాహన కాలాన్ని చిత్రించే హిమబిందు నవలను వ్రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రమోద్ కుమార్ చతోపాధ్యుని శిష్యరికం చేసి భారతీయ చిత్రకళా రహస్యాలను తెలుసుకున్నారు. తరువాత భీమవరంలో లాయర్ వృత్తి చేపట్టిన కాలంలో నారాయణరావు అనే సాంఘిక నవల వ్రాశారు. అదే సమయంలో తిక్కన చిత్రం గీసి ఆంధ్ర యూనివర్సిటీ బహుమతి పొందారు. 19 39 లో సినిమాలకు ఆకర్షితులై మూడు చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే'మీ జిన్'అనే దినపత్రికకు సంపాదకత్వం వహించి'తుఫాను', గోన గన్నారెడ్డి, కోణంగి 'నవలలు ప్రకటించారు. వీరి రచనలలో అమోఘవర్ణన, నిశిత పరిశీలన, అపార పాండిత్యం మనకు గోచరించి ఒక్కొక్కసారి కధా గమనానికి ఆటంకం కలగడం కూడా కద్దు. ఇన్ని పోకడలు పోయి అందరి మన్ననలు పొందిన వీరు 1952లో పరమపదించారు.

కామెంట్‌లు