స్వామి రామానంద తీర్థ. (1903-1972);- తాటి కోల పద్మావతి


 గాంధీజీ సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా ఆచరించి హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమానికి నిర్దిష్ట స్వరూపం కలిగించిన ఘనత స్వామీజీదే. ఒకరకంగా తెలంగాణ ప్రజల స్వాతంత్ర చరిత్ర ఆయన చరిత్రగా అభివర్ణించవచ్చు. ఆయన అసలు పేరు వెంకట్రావు వెంకట్రావు కేడ్గికర్? సన్యాసాశ్రమం స్వీకరించి స్వామి"రామానంద తీర్థ"అయ్యారు. వీరు గుల్బర్గా జిల్లాలోని సింద్గీ గ్రామంలో 19 0 3 లో జన్మించారు. 19 16 లో తిలక్కు ఇచ్చిన'హోమ్ రూల్ 'ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. అదేవిధంగా గాంధీజీ పిలుపుతో చదువుకు స్వస్తి పలికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఆయన విజన్ అనే వార పత్రికను నడిపారు. 1951 పార్లమెంటు ఎన్నికల్లో 19 56 ఎన్నికల్లో గుల్బర్గా పార్లమెంటు నుండి పోటీ చేసి గెలిచారు. కానీ తర్వాత స్వచ్ఛందంగా రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆర్థిక సమానత్వం లేని రాజకీయ స్వాతంత్రం అర్ధరహితం అని ఆయన భావించడమే అందుకు కారణం. ఆ తర్వాత వినోబా భూదానోద్యమాల్లో హిందీ ప్రచార సభల్లో పాల్గొని కొంతకాలం పిఠాపురం వద్ద తోటపల్లి కొండల్లోని శాంతి ఆశ్రమం లో గడిపారు. అక్కడనుండి తిరిగి వచ్చాక 1972లో అస్వస్థతకు గురై మరణించారు. ఆ తదనంతరం ఆయన సంస్కరణార్థం స్వామి రామానంద తీర్థ సామాజిక, ఆర్థిక పరిశోధన జాతీయ సమైక్యత సంస్థను నెలకొల్పారు. ఆయన నిస్వార్థ జీవితం ఎందరికో ఆదర్శమయ్యింది.


కామెంట్‌లు