వావిలాల గోపాలకృష్ణయ్య. (1906-2003).;- తాటి కోల పద్మావతి


 తెలుగు నాట చెలరేగిన అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న నిజాయితీపరుడైన కార్యకర్త, నిస్వార్ధ జీవి వావిలాల గోపాల కృష్ణయ్య. వీరు 1906లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. 19 29 లో సత్తెనపల్లిలో'శారదా గ్రంథాలయం'స్థాపించారు. గ్రంథాలయం ఒక యువ జన కూటమి. ఆ గ్రంథాలయ ప్రభావం చేత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 19 30 ఉప్పు సత్యాగ్రహంలో, 1932లో శాసనోల్లంఘన, 19 33 లో వ్యక్తి సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. గ్రంథాలయాల ప్రతిపత్తిని, ప్రైవేటు గ్రంథాలయాల అభివృద్ధికి శాసనసభలో, బయట అవిరళ కృషి చేశారు. వీరు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా 19 52-72 వరకు వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 1979లో ఆంధ్ర విద్యా కళాపరిషత్తు గౌరవ డాక్టరేట్ 1992లో భారత ప్రభుత్వం'పద్మభూషణ్'తో గౌరవించాయి. వీరు 2003లో గుంటూరులో స్వగృహంలో పరమపదించారు.


కామెంట్‌లు