నార్ల వెంకటేశ్వరరావు. (1908-1985);- తాటి కోల పద్మావతి


 తెలుగు పత్రికా రంగానికి నూతన వరవడి సృష్టించిన ప్రజ్ఞాశీలి నార్ల వెంకటేశ్వరరావు. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంస్థాపక సంపాదకుడు నార్ల. ఈయన 1908లో జబల్పూర్ లో జన్మించారు. మచిలీపట్నం నోబుల్ కాలేజీ విద్యార్థిగా ఉండగానే వచన వ్యాసంగాన్ని చేపట్టారు. ఆ రోజుల్లోనే'కృష్ణా పత్రిక'పార్ట్ టైం ఎడిటర్ గా పనిచేశారు.డా"పట్టాభి గారి'జన్మభూమి'పత్రికకు, లాహోర్ నుండి వెలువడే'పీపుల్స్'కు ప్రిలాన్సుగా వ్యాసాలు రాసి వాటితో వచ్చే పైసలు ఫీజులకు తన ఖర్చులకు వాడుకునేవారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా'ఉప్పు సత్యాగ్రహం'గురించి జన్మభూమికి వ్యాసం రాసినందుకు బ్రిటిష్ వారి లాటి దెబ్బలు తిన్నాడు. ఆ రోజే జర్నలిజం వృత్తిగా చేపట్టాలని మద్రాసు బయలుదేరాడు. మొదట'జస్టిస్'అనే పత్రికలో అప్రెంటీస్ గా చేరాడు. ఆ పత్రిక ఏమి ఇవ్వకపోయినా పోలీస్ రిపోర్టు ఆధారంగా ఉగ్రవాదిగా కోరుకుంటూ ఉద్యోగం నుండి తొలగించారు. ఆ తర్వాత 1938లో ఆంధ్రప్రభ లో న్యూస్ ఎడిటర్ గా చేరి త్వరలోనే సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లు కూడా శ్రీ నార్ల సంపాదకీయాలు పనిచేశాయి. నాగార్జునసాగర్ కు ఆ పేరు సూచించింది కూడా ఆయనే. తన కలం బలంతో సమస్యలకు ఉద్యమ రూపం ఇచ్చిన పత్రిక సంపాదకుడు. ఈయన హేతువాది, మానవతావాది కూడా. ఆయన కలం బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి లను కూడా వదలలేదు. ఆయన నిర్భీతికి వారు ఆశ్చర్యపడేవారు. ఆ తర్వాత 1960లో విజయవాడలో ఆంధ్రజ్యోతి స్థాపించినప్పుడు దాని సంపాదకులుగా ఉండి 1970 వరకు పని చేశారు. మాట-మంతి, వేమన గురజాడ, వీరేశలింగంపై ఎన్నో సాధికారిక రచనలు చేయడమే కాక'నవయుగాల బాట నార్ల మాట'అనే మకుటంతో రాసిన పద్యాలు వేమనను మరిపిస్తాయి. ఆధునిక తెలుగు జర్నలిజానికి ఆధ్యుడుగా పేర్కొనదగ్గ నార్ల 1985లో పరమపదించారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం