కొడవటిగంటి కుటుంబరావు. (1909-1980); - తాటి కోల పద్మావతి

 గుంటూరు జిల్లా తెనాలి వద్ద గల ఒక కుగ్రామంలో జన్మించారు. సాహితీ వ్యాసాంగం ఉన్న కుటుంబంలో జన్మించారు. బెనారస్ లో బి ఏ చదువుతూ తిరిగి వచ్చి ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఎన్నో పత్రికలకు కథలు, వ్యాసాలు వ్రాసి చివరకు మద్రాసులో చిన్నపిల్లల కోసం పుట్టిన'చందమామ'కు సంపాదకుడిగా చేరి జీవితాంతం అక్కడే స్థిరపడ్డారు. ఆయన మార్కి జానీ గాఢంగా నమ్ముకున్నారు. తన అభిప్రాయాలను కథలు,‌ నవలలు వ్యాసాలు ద్వారా ప్రచారం చేశారు. ఆయన రచనల్లో'చదువు'నవల ప్రసిద్ధి చెందింది. కథలు, గల్పికలు, సాహిత్య వ్యాసాలే కాక శాస్త్ర విజ్ఞానంపై ఉంటాను పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు వ్రాశారు. మొదటినుండి అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడు ఆ తరువాత విరసంలో చేరి చివరి వరకు ఆ సంఘంలో కొనసాగారు. 'చలం, గోపీచంద్, కుటుంబరావులను'తెనాలి త్రయంగా సాహితీ ప్రియులు భావిస్తారు.‌ ఈయన రచనలు సాదాసీదాగా లేకుండా నగిషీలు లేకుండా సాధారణ పాటకుడికి సూటిగా అర్థమయ్యేటట్లు ఉంటాయి. ఆయన 1980లో మద్రాసులో మరణించారు.

కామెంట్‌లు