ప్రతిభామూర్తులు. పుచ్చలపల్లి సుందరయ్య. (1910-1985);- తాటి కోల పద్మావతి.


 అధికారిక పదవులేవి చేపట్టకపోయినా ప్రజా నాయకుడిగా నిరాడంబరగా భారత దేశంలోనే పేరెన్నిక గన్న ఆదర్శ కమ్యూనిస్టు. వీరు 1910 లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా అలాగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం తిరువల్లూరు, రాజమండ్రి, బెంగుళూరు కొంతకాలం మద్రాసులోనూ జరిగింది. 1925లో రాజమండ్రిలో ఉండగానే కొందరు విప్లవకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటినుండి ఆయనలో దేశభక్తి బీజాలు నాటుకున్నాయి. నాటుకున్నాయి చెన్నైలో చదివే రోజులలో కమ్యూనిస్టు మానిపిస్టో చూశారు. 19 30లో మొదట సత్యాగ్రహం చేసినప్పుడు తంజావూరు బోటల్స్ స్కూల్ కు పంపారు. 18 సంవత్సరాలు. అక్కడే ఆయన కామ్రేడ్ శివ వర్మను కలుసుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే కాక తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సంబంధాలు పెంచుకున్నారు. ఆ తర్వాత నిజం వ్యతిరేక పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటం విరపించి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేసి తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపొందారు. 1979 నుండి 83 లో ఆంధ్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. వీరి రాజకీయ అభిప్రాయాలతో ఏకీభవించని వారు కూడా ఇతడి నిజాయితీని త్యాగనిరతిని నిస్వార్థతను కొనియాడతారు. వీరు మూత్రపిండాల వ్యాధికి గురై 1985లో అపోలో ఆసుపత్రిలో మరణించారు.


కామెంట్‌లు