*హనుమాన్ చాలీసా - చౌపాయి 24*
 *భూత పిశాచ నికట నహిఁ ఆవై!*
*మహావీర  జబ  నామ  సునావై !!*
తా: తాటకాంతకా! పవనాత్మజా! నీ పేరు ఎవరైనా తలుచుకుంటే చాలు,  భూతాలు, పిశాచాలు, శాఖినీ, ఢాకినీ వంటి రాక్షసులు, వారు ఉన్న పరిసర ప్రాంతాలలో కూడా అవి ఉండవు, రావు.......అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: "నామ మహిమ" మన చిన్నతనం నుండి, మన పెద్దల దగ్గర, గురువుల దగ్గర వింటున్న మాట. ఎవరైనా అతిగా భయపడుతుంటే, "శ్రీ ఆజనేయం! శ్రీ ఆంజనేయం" అనుకోండి మీ భయం పోతుంది అని చెపుతారు. గట్టిగా మేఘాల ఘర్జన లేక పిడుగు శబ్దం విన బడితే "అర్జున, ఫల్గుణ, పార్ధ, కిరీటి..." అనే పాండవ మధ్యముని నామాలు చెప్పుకో మంటారు. సర్వ సాధారణంగా ఎందరో పలికే నామం "శ్రీ రామా!, రామయతండ్రి!, అయ్యో రామచంద్ర!" ఈ రామ నామం ఒకో సందర్భంలో ఒకో విధంగా పలుక బడుతుంది. ఎలా పలికినా, ఎక్కడ పలికినా, ఎప్పుడు పలికినా, పలికే వాడు ఒక్కడే "పరాత్పరుడు". ఎలా పలికినా, ఎప్పుడు పిలిచినా, ఎవరు పిలిచినా అభయకారకుడు పరమేశ్వరుడే. అటువంటి, సుందర నామం, ప్రతీ క్షణం మనకు అండగా ఉండేలా అనుగ్రహించాలని ......... శాశ్వతుడు, రాజీవలోచనుడు, అయిన దాశరథిని వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు