*హనుమాన్ చాలీసా - చౌపాయి 28*
 *చారోఁ  యుగ  ప్రతాప  తుమ్హారా !*
*హై  పరసిద్ధ   జగత   ఉజియారా !!*
తా: సర్వ దుఃఖహరా ! హనుమా ! నాలుగు యుగాలలో నీ అద్భుతమైన ప్రతాపపు శక్తి వ్యాపించి ఉన్నందు వలన ఈ జగత్తు మొత్తం ప్రకాశవంతం అవుతోంది........అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: పరమాత్ముని శక్తి, ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది, అనే సత్యాన్ని మరొక్కసారి గోస్వామి తులసీదాసు గారు మనకు గుర్తు చేస్తున్నారు, ఈ చౌపాయీ ద్వారా. మన కంటి రెప్ప కదలాడినా, సూర్యనారాయణ స్వామి పొద్దున్నే ఉదయించి, సాయంత్రం అస్తమించినా, పక్షులు ఎగిరినా, గాలి కదలినా, ఈ భూప్రపంచం మీద ఏ పని జరిగినా అది అంతా ప్రతీ క్షణమూ పరమాత్ముడు చూపిస్తున్న అనుగ్రహమే. ఇంతటి కమనీయ రమణీయ మూర్తి, దయాసాగరుడు అయిన నిర్గుణ నిరంనజ నిరాకారుడు నిరంతరం మనకందరకు తన అనుగ్రహాన్ని పంచాలని, అలా ఆశీర్వదించమని ........ అమ్మ సీతమ్మని వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు