గ్రామ స్థితి (3);- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 1933లో  కొంతమంది యువకులను పోగు చేసి మా నాన్న ఆరుమళ్ళ సుబ్బారెడ్డి గారు అప్పుడు రామాయణం, భారతం, భాగవతాది  పుస్తకాలు బైండ్ చేసిన, పత్రిక సంపత్తులు వేమన గ్రంధాలయానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మూడు రోజులకు మా అన్నయ్య  పుట్టడంతో అతనికి  వేమన అనే పేరు పెట్టారు నాన్నగారు  1977 నవంబర్ 19వ తేదీన పెను తుఫాను వచ్చింది తూర్పు కృష్ణాలో వేల మంది జనం పశువులు గొర్రెలు  కోళ్లకు అపార నష్టం వాటిల్లింది గృహాలు చాలా వరకు పడిపోయాయి  మా గ్రామంలో కూడా గృహాలు కరెంటు స్తంభాలు చెట్లు పడిపోయాయి ప్రాణనష్టం జరగలేదు. రామాలయం ముందు ధ్వజస్తంభం తల గంటలకు విరిగిపోయింది. 1952లో ఒక హరిదాసు (మోపరిదాసు) దేవాలయంలో హరికథ చెబుతూ  అతను 49 లో పడిపోయిన ధ్వజస్తంభాన్ని చూసి గ్రామ ప్రజలకు పెద్దలకు ఒక విన్నపం చేశారు  ఆ విరిగిపోయిన ధ్వజస్తంభాన్ని చూసి  ఇప్పటికే ఆలస్యం చేశారు అని  ఆ స్తంభం ఏ ప్రక్కన పడిందో ఆ ప్రక్క చాలా ప్రమాదం సంభవిస్తుంది అన్నారు ఆయన మాటలను గ్రామస్తులు  పట్టించుకోలేదు 1949 తుఫానుకు శివాలయం  ధ్వజస్తంభం దక్షిణపు ప్రక్కకు పడిపోగా ఘోరము జరిగిన తర్వాత ధ్వజస్తంభాన్ని దేవాలయ ట్రస్ట్ బోర్డ్ ద్వారా అప్పటి బోర్డు ప్రెసిడెంట్ మల్లికార్జున్ రెడ్డి గారు 1958లో పునః ప్రతిష్టించారు  1964 లో మా గ్రామంలో నాలుగు సెకండ్ల పాటు కాలం  భూమి కంపించింది  తిరిగి 69 లో 5 సెకండ్ లు కాలం భూమి కంపించింది. 1925లో ఉప్పెన వచ్చినప్పుడు జనాలకు  సుబ్బారెడ్డి గారు భోజనాలు ఏర్పాటు చేశారు  32 లో ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన ఆస్తిపాస్తులు తన సంతానానికి రాసి ఇచ్చారు  వందేమాతరం రోజుల్లో స్వతంత్ర సమరయోధునిగా దేశం కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన వ్యక్తి సంఘసంస్కర్త కులమత రహితుడు వితంతు వివాహాలు చేసిన  సంస్కర్త  తెలుగులో పాండిత్యం గలవాడు. 1932 జైలుకు వెళ్లారు తామర పత్ర గ్రహీత  ఆయన 1934లో వేమన ఆశ్రమాన్ని స్థాపించి కపట స్వాముల బండారం లను బయట పెట్టారు కలికాలం వేదాంతం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా. 1942లో సుబ్బమ్మ గారిని  తన పాలేరు మాలపల్లి అతను  మూర్తి దగ్గరకు తీసుకువచ్చి ఆమె నూతి మీదకు ఎక్కి నీరు తోడి గిన్నెలో పోసి పాలేరుకు ఎత్తి ఆ నీరు ఇంటి దగ్గర పోయించి వస్తున్నది అది చూసిన సుబ్బారెడ్డి ఆమెతో సుబ్బమ్మ వాడు తీసుకెళ్లే నీరు వాడుకుంటే లేని అంటు నూతి నుంచి తోడితే నీళ్లకు అంటు ఉంటుందా అన్నారు. అప్పుడు ఆ కుర్రవాణితో తోడించిన మొదటి జోడు నీరు సుబ్బారెడ్డి గారు వారి ఇంటిలో పోయించారు అప్పటినుంచి గ్రామస్తులు హరిజనులతో నీరు తెప్పించుకున్నారు.

కామెంట్‌లు