*హనుమాన్ చాలీసా - చౌపాయి 30*
 *సాధుసంతకే తుమ రఖవారే !*
*అసుర నికందన రామ దులారే !!*
తా: గంధర్వ తత్వజ్ణానాయా ! ఆంజనేయ ! సాధువులను, మునులను, నువు రక్షిస్తూ ఉంటావు. అలాగే, రాక్షస మూకలను హతమార్చి, రామచంద్రమూర్తికి అత్యంత ప్రాణసమానుడవు, ప్రేమ పాత్రుడవు అయ్యావు........అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: మన చుట్టూ ఉన్న సమాజంలో, ఎవరైనా నలుగురికీ మేలు చేస్తూ, సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే, మనుషులము, మనకే ముచ్చట వేస్తుంది. "ఎంత మంచి మనసండి ఆతనిది. నలుగురికి సాయ పడుతున్నాడు" అని నలుగురికి మనమే చెప్తాము. మరి అటువంటి వారిని, సమాజం మంచి కోరే వారిని చూసి, పరమాత్ముడు కూడా ముచ్చట పడతారు, తన చల్లని చూపులతో చూస్తారు. అందుకే, దుష్టులను శిక్షించడంలో ముందువరుసలో ఉన్న హనుమను అక్కున చేర్చుకుని, "నీవు నాకు భరతుని కంటే ఎక్కవయ్యా" అని అన్నారు. మనమందరం కూడా, అవకాశం చేసుకుని, చేతనైనంత వరకు పక్కవారికి సహాయ పడుతూ, అపరిమితమైన సంతోషం పొందుతూ, భగవంతుని అవ్యాజమైన కరుణకు పాత్రులము అయ్యే సద్బుద్ధిని ఇవ్వమని....... అమ్మ సీతమ్మని వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు