దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (33);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మద్రాస్ నగరం గవర్నర్ జనరల్ వారి కార్యాలయం కార్యాలయపు సిబ్బందితో గల ఉన్నత అధికారులతో హడావుడిగా ఉంది ఆ హడావుడి అంతా వేంగళ రెడ్డి సత్కారపు ఏర్పాట్లకు సంబంధించినవి గవర్నర్ జనరల్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు లండన్ నుంచి తాకీలు అందాక గవర్నర్ జనరల్ కైనా బాధ్యత తప్పదు కదా తన క్రింది అధికారాలను పిలిచి చెప్పాడు  ఏర్పాట్లు ఘనంగా ఉండాలి ఈ ఏర్పాటు గురించి ఓ నివేదికను కూడా మన విక్టోరియా మహారాణి గారికి పంపవలసి ఉంటుంది వారికి చేయబోయే ఈ సత్కారం పలువురు మనలను పొగిడేలా ఉండాలి  ఆ దాతకు కూడా ఆనందాన్ని కలిగించాలి  అనగానే ఎస్సార్ అంటూ తలూపి అతని ఆదేశాలను పాటిస్తూ స్వాగతపు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
జరుగుతున్న ఏర్పాట్లు మరోసారి సాంతం పరిశీలించాక గవర్నర్ జనరల్  సంతృప్తిగా నితూర్చి తన ఛాంబర్ లోకి కదిలాడు  విక్టోరియా మహారాణి నుంచి పతకం పంపింది కదా మద్రాస్ లో గవర్నర్ జనరల్ గారి సమక్షంలో వేంగళరెడ్డి గారికి సన్మాన మట అన్న మాట ఉయ్యాలవాడ చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు జిల్లాలోనూ రాష్ట్రంలోనూ వ్యాపించి పోయింది. జిల్లా అధికారులు ఒకరి తర్వాత ఒక రెండు సందర్శించడం మొదలుపెట్టారు అందులో విద్యార్థులు జరగలేదు ఎక్కువ రెడ్డి పాపంతో తమ సొంత  పనులు చక్కబెట్టుకోవచ్చని కొందరు ఎందుకైనా మంచిది రెడ్డితో పనిచేయవుంచుకోవడం వల్ల భవిష్యత్తులో తమకు  ఉపయోగకరంగా ఉంటుందని మరికొందరు  ఇలా పడు ఉద్దేశాలతో తను చూడడానికి వచ్చిన వారందరికీ అప్పట్లోనే చిరునవ్వుతో మాట్లాడుతూ  సాగరంగా వారిన ఉచిత రీతిని సత్కరించు పంపేవాడే కానీ ఏనాడు వారి నుంచి ఏమీ ఆశించలేదు. స్వార్థం నశించినప్పుడు ఏమనికైనా తన కోసమని ఏమీ ఆశిస్తాడు.  ఒకవేళ ఆశించిన అది పరుల కోసమే ఉంటుంది కానీ తన కోసం కాదు జిల్లాలోనే తాను ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడుతున్న  గర్వం అనేది తన దరి చేరని వేంగళరెడ్డిని చూసి భోజనంతో పాటు ఇతరులు కూడా ముక్కున వేలేసుకున్నారు.  బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వబోతున్న పతకం గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటే వెంగళరెడ్డి ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి  తను ఎవరి నుంచి ఎలాంటి ప్రయోజనం ఆశించి ధర్మాలు చేయలేదు కీర్తి కాంచన కోసం  తానేనాడు తాపత్రయ పడలేదు మరి ఈ సత్కారాన్ని ఆశించడం భావ్యమేనా  అలాగని తిరస్కరించే సమంజసంగా ఉంటుందా ఇలాంటి ఆలోచనలతో సందిగ్రావస్తులో ఉన్న వెంగళరెడ్డికి సేవకుడు కబురు చేరవేశాడు.
కామెంట్‌లు