దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (35); - ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

అంతా విన్న తర్వాత మీరు మా దివాణంలోనే ఉండండి మీ శేష జీవితాన్ని ఇక్కడే ప్రశాంతంగా గడిపి వేయండి  మీకు ఎలాంటి కొరత ఉండదు నా చిన్నప్పటి సహ పాటి నా కళ్ల ముందే ఉన్నాడు అన్న తృప్తి నాకు ఉంటుంది  వెంగళ రెడ్డి చెప్పిన దానికి శేషాచార్యులు చాలాసేపు  సమాధానం ఇవ్వలేదు  సంశయిస్తున్నాడని గ్రహించిన వేంగళరెడ్డి చిన్నగా అతని  భుజం తడుతూ మనం స్నేహితులం అందులో చిన్ననాటి స్నేహితులం మన మధ్య సందేహాలు ఉండరాదు.  మీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పండి అంటూ అడిగాడు చెప్పక తప్పదనిపించి చెప్పాడు. శేషాచార్యులు నా పిల్లలు నన్ను ఎంతగా కాదనుకున్నా వారిపై మమకారం చావటం లేదు నా మరణం వారి చేతి మీద జరగాలని నా వాంఛ అతని ఉద్దేశం ఏమిటో వేంగళరెడ్డికి బోధపడింది వెంటనే లేచి తన సేవకునికి చెప్పాడు. దివాణా గుమస్తా దగ్గరకు వెళ్లి ఓ 100 రూపాయలు అలాగే పట్టు వస్త్రాలు తీసుకురా అనగానే  మ్రాన్ పడిపోయాడు  శేషాచార్యులు అరగంట తర్వాత వచ్చిన నూతన వస్త్రాలు వంద రూపాయలు  రొక్కం చేతిలో పెడుతూ  శేషాచార్యులకు చెప్పాడు రక్త పాశం తెంచుకోవడం అందరికీ అంత సులువు కాదు మీరు ఈ రొక్కం  ఉంచుకోండి మీ పిల్లలు దగ్గరే ఉంటూ శేష జీవితాన్ని గడపండి  అనగానే రెడ్డి గారు నా స్వార్థం మిమ్ములను  అతని మాటలను అడ్డుకుంటూ ఇందులో మీ స్వార్థమేమీ లేదు మనుషుల కంటే ధనం గొప్పది అని కాదు  శేషాచార్యులు లేచి వెంగళ రెడ్డి పాదాలను తాకపోయాడు ఆ ప్రయత్నాన్ని వారిస్తూ చెప్పాడు రెడ్డి  కాళ్లకు దండం పెట్టవలసిన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఒకరు తల్లిదండ్రులు మరొకరు విద్య నేర్పిన గురువు  వీరికి తప్ప మరెవరికి దండం పెట్టవలసిన అవసరం లేదు వెళ్ళి రండి అంటూ అతని ప్రయాణానికి కావలసిన వెచ్చాల్ని  కూడా అందజేసి దివాణం బయటి వరకు వెళ్లి సాగనంపాడు బుడ్డా వేంగళ రెడ్డి. ఆరోజు రాత్రి తలారి నరసింహతో సమాలోచన జరిపిన బుడ్డా వెంగళరెడ్డి తన మనసులోని సందిగ్ధన్ని చెప్పాడు అది విన్న నరసింహ  ఇందులో సంశయించడానికి ఏముంది దొర మీకోసం కాకపోయినా మన గ్రామం కోసం అయినా వెళ్లి తీరాలి  మా రెడ్డి మద్రాసు వెళ్లి సన్మానం చేయించి వచ్చాడు అని మన గ్రామస్తులు అందరూ చెప్పుకోవడానికి  అయినా మీరు వెళ్లి తీరాలి ఇది మీ ఒక్కరికి చేస్తున్న  సన్మానం కాదు మన గ్రామ ప్రజలందరికీ చేస్తున్న సన్మానం ఆలోచించండి  దొరా అన్నీ తెలిసినవారు ఇంతకంటే ఏమీ చెప్పలేను అన్నాడు  రాత్రి పొద్దు పోయే వరకు ఆలోచిస్తూ కూర్చున్న వేంగళ రెడ్డి కి చివరికి దళారి నర్సింహం చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని అనిపించింది.
 
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం