దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (36);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తనకోసం కాకపోయినా తన గ్రామానికి పేరు తెచ్చెందు కైన వెళ్లాలని నిర్ణయించుకున్న వెంగళరెడ్డి  కాగితంపై సీరాకు ముంచి ఉంచిన కలాన్ని తీసి కడప కలెక్టర్ కు లేఖ రాయడం ప్రారంభించాడు  గౌరవ్య కలెక్టర్ గారికి మీరు ప్రతిపాదించిన సత్కార కార్యక్రమాలకు నేను అంగీకరిస్తున్నాను. ఈ మాసం ఇక్కడి కార్యక్రమాల వల్ల నాకు వీలుపడదు వచ్చే మాసం తారీకు మీరే నిర్ణయించి గవర్నర్ జనరల్ గారి కోసం రాసి పంపగలరు. వీలును బట్టి మిమ్ములను త్వరలో స్వయంగా కలుసుకో గలను  ఇట్లు బుడ్డా వేంగళ రెడ్డి  వ్రాసిన కమ్మని ఓ మారు చదువుకున్న వెంగళరెడ్డి  తెల్లవారి తలారి నరసింహమును విడిచి చెప్పాడు కడపకు వెళ్లి ఈ కమ్మలు కలెక్టర్ జేమ్స్ గారికి  ఇచ్చిరా అని. చిత్తం దొరా అంటూ కమ్మ అందుకని అప్పుడే కడపకు ప్రయాణం అయిపోయాడు  నరసింహం.
కడప కలెక్టర్ ఇచ్చిన తారీకు ప్రకారం వెంగళరెడ్డి చెన్నపట్నానికి ప్రయాణమయ్యాడు బయలుదేరే ముందు బంధువులు మిత్రులు ఊరి జనం వచ్చి శుభాకాంక్షలు అందజేశారు  వెంట తలారి నరసింహం లాగా వెంగళరెడ్డి మరి కొంతమంది వ్యక్తులతో గుర్రం బగ్గిలో ప్రయాణం అయ్యాడు. వేంగళ రెడ్డి చెన్న పట్నం వెళుతున్నాడు అన్న వార్త వ్యాపించగానే బీద బిక్కి జనం దారి మధ్యలో తగిలిన ఊళ్ళలో అతనికి ఎదురయ్యే సహాయం అందించారు.  ఈ పరిస్థితిని ముందే ఊహించిన వెంగళరెడ్డి వెంట తెచ్చుకున్న తరాన్ని ఓ సంచిలో ఉంచితే తన ప్రయాణాన్ని కొనసాగించాడు  మార్గ మధ్యలో కాసేపు కడుపులో విశ్రాంతి తీసుకుని అక్కడ తనను కలవడానికి వచ్చిన వ్యక్తులను అధికారులను ఆప్యాయంగా పలకరించి తిరిగి ప్రయాణమయ్యాడు.
అలా అక్కడక్కడ మజిలీలు చేస్తూ రెండు రోజుల తర్వాత చెన్నపట్నానికి చేరుకున్న వెంగళ రెడ్డికి ప్రభుత్వ అధికారులు ఘనంగా  స్వాగతం ఇచ్చారు. మౌంట్ రోడ్ లో ఉన్న తమ విశ్రాంతి అతిథి గృహంలో అతనికి ఏర్పాటు చేశారు. గవర్నర్ కార్యాలయంలోనే సాయంకాలం వేళ సత్కార సభ  ముఖ్యమైన అధికారులు చెన్న పట్నం పుర ప్రముఖులు  అందరు ఆ సమావేశానికి హాజరయ్యారు. గవర్నర్ జనరల్ ఆంగ్లంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఈవేళ ఎంతో సుదినం ఈ ప్రపంచంలో కేవలం తమకోసం తమ కుటుంబం కోసమే జీవించే వారు ఉన్నారు కానీ అక్కడక్కడ సమాజం కోసం బతికేవారు ఉన్నారు  అలాంటి వారిలో బుడ్డా వెంగళరెడ్డి గారు  ఒకరు ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతమైన కడప జిల్లాలో ఉయ్యాలవాడ గ్రామానికి చెందినవారు  వీరి పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా విధితమే.


కామెంట్‌లు