దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (38); - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ  నేను గొప్పగా ఏమీ చదువుకోలేదు నాది కేవలం గ్రామస్థాయి చదువు మాత్రమే  అయితే నాకు జిజ్ఞాస వల్ల పుస్తక పఠనం వల్ల మరి కొంత జ్ఞానాన్ని సంపాదించగలిగాను ఇక ఈ సత్కారం గురించి పేరు ప్రఖ్యాతుల ఆశించి నేనిదంతా చేయడం లేదు  మానవునిగా సాటి మనిషికి నా వంతు సేవ చేయాలనే తపనతో చేశాను. నా అంతిమ ఘడియ వరకు కూడా చేస్తూనే ఉంటాను  నాకెలాంటి సత్కారాలపై పెద్దగా ఆశ లేదు విక్టోరియా మహారాణి లాంటి వారు పంపిన తిరస్కరించడం భావ్యం కాదని ఈ సత్కారం రాబోయే తరానికి ఒక చారిత్రక చిహ్నంగా  నిలుస్తుందని భావించి వచ్చాను ఏదేమైనా నన్ను సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు జరిపించి
నన్ను ఈ విధంగా సత్కరించి నాలోని ఉద్దేశాన్ని పలువురు ముందు చెప్పడానికి అవకాశం కల్పించిన గవర్నర్ జనరల్ గారికి వారి సిబ్బందికి  ఇతర అధికారులకు ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని ముగించారు వేంగళ రెడ్డి తెలుగు ప్రసంగాన్ని దుభాషి ఇంగ్లీషులో అనుమతించి వివరించాడు  ప్రేక్షకులలో పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు ఓ మామూలు వ్యక్తిగా కనిపించే ఇతనిలో ఎంత లోతైన ఆలోచనలు ఉన్నాయి అని సభాకులందరూ నివ్వెర పోయారు  సభా వేదిక పైన గవర్నర్ జనరల్ కూడా ముగ్ధుడై పోయాడు ఆనందంతో వెంగళరెడ్డిని కౌగిలించుకున్నాడు అతని కళ్ళు  చమర్చాయి.
గవర్నర్ జనరల్ విజ్ఞప్తి మేరకు రెండు రోజులపాటు అక్కడే ఉండి చెన్నపురంలో ఉండే పురాతన కట్టడాలను బ్రిటిష్ వారి కట్టడాలను మరియు ముఖ్యంగా అక్కడి చర్చిని దర్శించారు  చర్చిని దర్శించడమే కాక లోపలికి వెళ్లి ప్రార్థన కూడా సలిపేసరికి అతని వెంట ఉన్న బ్రిటిష్ అధికారులు నివ్వెర పోయారు. ప్రార్థన జరిపి బయటకు వచ్చాక అధికారులు మీరు మా మతాన్ని నమ్ముతారా అనగా  మతాన్ని నమ్మను మనిషిని నమ్ముతాను నా దృష్టిలో ఏసుక్రీస్తు మానవత్వం విలువలను ప్రబోధించిన గొప్ప ప్రవక్త  ఆ మానవత్వపు విలువల కొరకే శిలువపై రక్తాన్ని కూడా చిందించి అమరుడయ్యాడు  ఆయన త్యాగశీలతకు జోహార్లు అర్పిస్తున్నాను. ఇతనే కాదు మానవాళి కోసం శ్రమించిన వ్యక్తి ఎవరైనా వారికి శిరస్సు వంచి నమస్కరిస్తాను  అన్న వేంగళ రెడ్డి మాటలు వారి హృదయాల్లో సూటిగా దూసుకుపోయాయి.
కామెంట్‌లు