దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (39);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ సమయంలో వేంగళ రెడ్డి ఓ వ్యక్తిగా కాక మహనీయుడుగా వారి కళ్ళకు ప్రస్ఫుటించాడు.  అప్రయత్నంగానే వారి చేతులు ముకుళింపబడి అతనికి అభివాదం తెలిపారు వారి అభివాదానికి ప్రతి అభివాదం చేస్తూ  చిరునవ్వున చర్చివంక ఓమారు కలయ చూసి తన గుర్రపు బగ్గీ వైపు తిన్నగా అడుగులు వేశాడు వేంగళ రెడ్డి  అధికారుల కళ్లలో ఆనందం వెంగళరెడ్డి వంటి వ్యక్తులను కలుసుకున్నందుకు వారి పలుకులకు ఆనందం  ఇది  అర్ధరాత్రి సమయం కడప జిల్లాలోని ఒకానొక గ్రామమది వేసవికాలం అవడం మూలాన జనాలందరూ ఆరుబైట మంచాలు వేసుకుని గాఢనిద్రలో నిమగ్నమై ఉన్నారు. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది అలాంటి సమయంలో దూరం నుంచి  గుర్రాల డెక్కల చప్పుడు. క్రమేపి ఆచప్పుడు దగ్గరయ్యింది గుర్రాలపై వచ్చిన వ్యక్తుల చేతిలో కాగడాలు అందులోని ఓ వ్యక్తి వెంట వచ్చిన వ్యక్తుల వంక చూస్తూ చెప్పాడు  గ్రామస్తులు మంచి నిద్రలో ఉన్నారు చూడడానికి ఇదే అనువైన సమయం పదండి అంటూ మళ్ళీ చెప్పాడు. ఎలాంటి అలికిడి లేకుండా పుల్లయ్య ఇంటికి చేరుకోవాలి అనగానే అంగీకారంగా తలలూపారు. అతని వెంట ఉన్నవారి  గుర్రాలు మెల్లిగా నడక ప్రారంభించి కొద్ది దూరం నడిచాక ఒక పెద్ద ప్రపంచం  అప్పుడు దిగండి అన్న శబ్దం విని  అందరూ గుర్రాలు దిగారు  పరిసరాలను ఓమారు గమనిస్తూ ఆ భవంతి ఆవరణలోకి అడుగు పెట్టారు  కాపలాగా ఉన్న ఇద్దరు పాలేర్లు గాఢ నిద్రలో ఉన్నారు. వారి పని పట్టండి అన్నట్లుగా చూసాడు ఆ వ్యక్తి.
వెంటనే వెళ్ళి ఆ ఇద్దరి పాలేర్ల నోళ్లు మూసి శబ్దం బయటికి రాకుండా స్తంభానికి కట్టి అరవకుండ నోట్లో గుడ్డలు కుక్కతూ అడిగారు పుల్లయ్య ఎక్కడ పడుకున్నారు  అని  ఫైన అని సమాధానం  తలుపులు వంక చూశాడు ఆ వ్యక్తి తలుపులు మూసి ఉన్నాయి  వాటిని విరగ్గొట్టి పెట్టడం అసాధ్యం కాకపోయినా సమయం వృధా అవుతుందని గ్రహించిన వ్యక్తి తన మనసులోని ఉద్దేశాన్ని తోటి వారితో చెప్పాడు  మేడ పైకి  తాళ్ళు వేయండి అని గుర్రాలకు తగిలించి ఉంచిన తాళ్ళను  మేడ పైకి విసిరారు. వాటికి కొక్కాలు బిగించి ఉండడం వల్ల పట్టు దొరికింది ముందుగా ఆ వ్యక్తి తాడు సహాయంతో పైకి ఎగబాకాడు. అతని వెంట మరో ఇద్దరూ కింద మరో ముగ్గురు పరిసరాలను గమనించేందుకు ఉన్నారు.


కామెంట్‌లు