దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (40)- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మేడ పైకి  చేరుకున్న వ్యక్తి నలు దిశలా చూశాడు కుడివైపున మేడపైన గదిలో పట్టి మంచం పై సుఖంగా నిద్రపోతున్నారు  వారికి కావలసిన వ్యక్తి అతన్ని చూడగానే వారి కళ్ళు మెరిసాయి. మెల్లిగా అడుగులు వేస్తూ ముగ్గురు అతని పక్క దగ్గరకు చేరుకున్నారు  ముగ్గురు తమ నడుమున దాచుకున్న బిడిబాకులను బయటకు తీశారు ఆ వ్యక్తి తలను తాకి నిద్ర లేపారు పుల్లయ్య నిద్ర లేచాడు ఉలిక్కిపడి కళ్లు తెరిచి ఆ ముగ్గుని చూసి గట్టిగా కేక వేయబోయాడు  కత్తి గురిపెట్టిన విషయం గుర్తుకొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాడు  ప్రాణభయంతో గడగడా వణుకుతూ చెప్పాడు నన్ను చంపకండి  అనగానే చెప్పిన ప్రకారంగా  వింటే చంపం ఊ పదా  అంటూ అతన్ని లేపి కూర్చోబెట్టారు ఎక్కడికి అని అడిగాడు ఇనప పెట్టి దగ్గరకి అన్నాడు. నా దగ్గర డబ్బు ఏమీ లేదు నన్ను వదిలేయండి అంటే ఉందో లేదో నేను చూడాలి అన్నారు  పద అంటూ ఆ వ్యక్తి ఈ మారు తన చేతిలోని బాకుతో పుల్లయ్య వెన్నుపై గుచ్చాడు  ఇక తాత్సారం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గదిలోకి నడిచి ఇనపపెట్టి ముందు నిలిచాడు పుల్లయ్య  ఇలా పెట్టి తెరువు  అనగానే ఇక తెరవక  తప్పలేదు పుల్లయ్యకు. తెరుచుకుంది డబ్బులు బంగారు ఆభరణాలు వాటిని చూడగానే ఆ వ్యక్తి తన వెంట తెచ్చిన సంచి తీసివాటన్నిటినీ మూటకట్టి ఇవ్వు అన్నాడు అతను చెప్పింది తరువాయి అందులోనే డబ్బులు నగలు పుల్లయ్య ఎంతో మందిని ఎన్నో విధాలుగా పీడించి  సంపాదించిన డబ్బు ఇది నాకు తెలుసు అంటూ పుల్లయ్యను స్తంభానికి కట్టివేసి అరవకుండ నోట్లో గుడ్డ  కుక్కతూ ఆ వ్యక్తి  
తమ పని సులువుగా పూర్తయినందుకు ఆనందిస్తూ గది బయటికి వచ్చిన ఆ ముగ్గురు చిన్నగా అడుగులేస్తూ మరల వరండాలో కిందకు దూకారు  గుర్రాలు ముందుకు దూకాయి నెమ్మదిగా కాదు అందుకే వేగంతో ఆ వ్యక్తి తన చేతిలోని  దివిటీని విసిరి వేశాడు. ఆ దివిటీ వెలుగుతూ ఉంది. దోపిడీ చేసిన ఇళ్లలో దివిటీని విసిరివేయడం అతని రివాజు.  అందుకే డివిటి గల మల్లిగాడుగా పేరు పొందాదు అతనంటే అందరికీ హడల్ అతను సాగించిన దోపిడీలకు  లెక్కే లేదు  బ్రిటిష్ వారి దృష్టిలో అతని పేరు మోసిన దోపిడీకారుడు బ్రిటీష్ ప్రభుత్వం అతని ఆచూకీ తెలిసినా పట్టుకున్నా వెయ్యి రూపాయలు బహుమానంగా ప్రకటించింది  అపారహ్న వేళ  ఆ గ్రామంలోకి గుర్రాల దండు దూసుకొచ్చింది ఆ దండు చూడగానే భయం కలగలేరు ఆనందమే  వేసింది.
కామెంట్‌లు