హైదరాబాద్ లో 49 సంవత్సరాలు.... ;- పోణంగి బాల భాస్కర్ ...
 నల్లేరు మీద నడకలా సాగిన... 
అందమైన అనుభవం ... ....
--------------------------------------
సరిగ్గా నలభై తొమ్మిదేళ్ళ క్రితం ఇదే రోజున, అంటే -1974 జూన్ 12వ తేదీన పోణంగి బాల భాస్కర్ అనే నేను పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు నుండి బయలుదేరి, ఉద్యోగం కోసం హైదరాబాద్ లో అడుగు పెట్టాను.
చిక్కడపల్లి లో మా మేనత్తగారి ఇంట్లో ఉంటూ మూడున్నర నెలల ఉద్యోగ ప్రయత్నం అనంతరం 1974 అక్టోబర్, 23వ తేదీన ఆబిడ్స్ లోని శ్రీ బృందావన్ హోటల్ లో జాయిన్ అయ్యాను.అక్కడే దాదాపు మూడున్నర సంవత్సరాలు బిల్ రైటర్, రిసెప్షనిస్ట్, కేషియర్, సూపర్వైజర్, టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసాను.
1978 ఫిబ్రవరి 23వ తేదీన HMT Machine Tools Limited లో టెలిఫోన్ ఆపరేటర్ గా జాయిన్ అయ్యాను. HMT లో 35 సంవత్సరాల 9 నెలల సుదీర్ఘ సర్వీసు పూర్తిచేసుకుని, 2013 నవంబర్ 30వ తేదీన Material Management Dept. లో Deputy Manager గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయి కూడా అప్పుడే పదేళ్ళు కావస్తోంది. 
చూస్తుండగా, దాదాపు ఐదు దశాబ్దాల కాలం ఐదు క్షణాల్లా గడచినట్లు ఉంది.
సుమారు గత 40 ఏళ్లుగా నా వృత్తి తో పాటు ప్రవృత్తి గా ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా కలగడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ఈ 50 ఏళ్లలో ఎన్నో కష్టాలు, నష్టాలు,
సుఖాలు, ఆనందాలు, అనుభవించాను. అయితే, అన్నీ మనమంచికే అనుకుంటూ ముందుకు సాగాను. ఎటువంటి నిరాశా, నిస్పృహలకు తావులేకుండా, చివరికి, అంతా సంతృప్తి గానే గడచింది. 
ఎందరో స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, అధికారులు అందజేసిన సహాయ సహకారాలతో... కుటుంబ సభ్యుల నిరంతర ప్రోత్సాహంతో...  సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానం లో ఈ రోజు ఇలా ఉండగలిగినందుకు ఈ సందర్భంగా.. అందరికీ.. నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ....
ఆ సర్వేశ్వరునికి - భక్తితో మనః స్ఫూర్తిగా, వినయంగా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
.

కామెంట్‌లు