దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (50);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సరియైన వైద్య సహాయం లేక మరణిస్తున్న ప్రజానీకాన్ని చూసి వేంగళ రెడ్డి ఆక్రోశానికి  అంతులేదు. వెతగ్గా వెతగ్గా ఓ మూల పెట్టెలో ఉన్న  బంగారు ఉంగరం గుర్తుకు వచ్చింది దాన్ని వెతికి తెచ్చి తలారి ఇచ్చి చెప్పాడు దీన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కన్నులకి వెళ్లి మందులు పట్టుకురా అన్నాడు రెడ్డి. చిత్తం అంటూ వేంగళ రెడ్డి మాటని తూచా తప్పకుండా ఆచరించి ఉంగరం డబ్బుతో మందులు తెచ్చాడు తలారి నరసింహం. ఆ మందులని గ్రామం అంతా పంపిణీ చేయించాడు. అందరికీ మందులు వేయించాడు వెంకటరెడ్డి కలరా తోక ముఖం పట్టింది జనాల వాగ్తులు తగ్గాయి ప్రాణాలు నిలబడ్డాయి. ఆ రోజు డిసెంబర్ 31  ఊరంతా తిరిగి కలరా బాధితులను పరామర్శించి వస్తూ మందు వేయించుకోనని  మొరాయిస్తున్న ఓ ఐదేళ్ల కుర్రాడికి ఈ రూపాయితో మిఠాయి కొనుక్కో అయితే ముందు మందు వేయించుకుంటేనే ఇస్తాను అంటూ షరతు పెట్టాడు.
బఠాయి కొనుక్కోవచ్చు అని ఆశతో గెలవడం అంగీకరించాడు మందు వేయించుకున్నాడు వెంకటరెడ్డి రూపాయి ఇచ్చాడు అతని దగ్గర ఉన్న చివరి రూపాయలు  అదే అతను చేసిన తుదిదానం కూడా అదే  ఊరంతా తిరిగి దివానానికి వచ్చేసరికి సోష వచ్చినట్లయితే  రెడ్డి వాలు కుర్చీలో కూర్చున్నాడు ఏదో అయిపోతున్నట్టు అనిపించింది కళ్ళు బాయిర్లు కమ్ముతున్నట్టు అనిపించి లేచే ప్రయత్నం చేస్తూ చప్పున కింద పడిపోతూ నరసింహం అంటూ అరిచాడు  నరసింహం పరుగున వచ్చి వెంగళరెడ్డిని తల  వల్లోకి తీసుకున్నాడు  నరసింహం వంకగా నరుపకుండా ఒక నిమిషం పాటు  చూసి తల కిందకి వాల్చేశాడు వేంగళ రెడ్డి.
జరిగినదేమిటో గ్రహించిన నరసింహం బోరున ఏడవడం ప్రారంభించారు ఒక దీపం ఆరిపోయింది  ఊహ తెలిసినప్పటి నుంచి పరువుల కోసమే జీవించిన ఓ మహాశయుని మహాయాత్ర ఆగిపోయింది. శతాబ్దానికి చారిత్రక పురుషుడు కొందరే పుడతారు అలాంటి వారిలో ఒకరు బుడ్డా వెంగళరెడ్డి ప్రపంచంలో దయాగుణం నిలిచి ఉన్నంతవరకు ఇతని చరిత్ర శాశ్వతం. కర్నూలు జిల్లా ఇద్దరు గొప్ప చారిత్రక పురుషుల అందించండి ఒక విషయం  ఒకరు శౌర్యంలో ప్రతికగా నిలిచారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.  మరొకరి దయ గుణానికి దాతృత్వానికి ప్రతికగా నిలిచారు ఇద్దరిదీ ఒకే ఊరు ఇద్దరు ఒకే మూల వంశానికి చెందిన పట్టు బొమ్మలు  వెంకటరెడ్డి మరణ వార్త వినగానే జిల్లా ప్రజానీకంలో విషాదం కమ్ముకుంది


కామెంట్‌లు