అవయవాలు దేనికి...?;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పుస్తకం హస్తపూ క్షణం అని పెద్దలు చెబుతూ ఉంటారు  మీకు లోకజ్ఞానం రావాలి అంటే నీ చేతిలో ఏదైనా ఒక పుస్తకం లేదా ఒక పత్రిక ఉండాలి  అది చదివి ఆరోజు పరిస్థితులను అవగాహన చేసుకుని  ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది  ఇంతకుముందు జరిగిన వాటికన్నా మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా  ఇలాగే జరుగుతూ ఉంటే మంచి జరుగుతుందా సమాజానికి చెడు జరుగుతుందా అన్న విషయాన్ని  కూలంకషంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది  దానికి తగిన విధంగా ప్రవర్తించడానికి  మీరుఆయుధం కావడానికి అవకాశం దొరుకుతుంది  ఏది మంచిది  ఏది చెడ్డది అని నిర్ణయించుకోవడానికి ఈ పత్రికలు  పుస్తకాలు మీకు ఎంతో దోహద పడతాయి జీవితంలో ఏం చేయాలి ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా నిర్ణయాన్ని  తీసుకోవడానికి  సహాయపడతాయి. ఈ శరీరాన్ని ఈ భూమి మీదకు ఎందుకు పంపించాడో ప్రహ్లాదని ద్వారా చక్కగా చెప్పించినవాడు పోతన చేతికి ఉండవలసినది దానం  ఉన్న ఆస్తినంతా ప్రజలకు దానం చేయమని ఎక్కడ ఎవరు చెప్పరు  భారతంలో విదురుడు కూడా నీవు సంపాదించిన దానిలో ఎనిమిది పాయింట్ మూడు మూడు  శాతం దానధర్మాలకు వినియోగించమని నీవు జీవించినట్లుగానే ఇతరులు కూడా జీవించాలని ఆలోచన పెట్టుకోవడానికి ఇది ప్రథమ సోపానం. వ్యాస మహర్షి చెప్పిన విషయం మానవునికి నోరు ఎందుకు ఏర్పాటు చేయబడింది భోజనం చేసి ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసమేనా మరి ఏదైనా ప్రయోజనం ఉందా అంటే సత్యాన్ని తప్ప మరి దేనిని పలకవద్దు అని చెప్పడానికి కంఠం ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మరాజు అబద్ధం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏనుగును రప్పించి దానిని చంపించి అక్కడ  చెప్పవలసిన అబద్ధం చెప్పాడు తప్ప సత్యానికి ద్రోహం చేయలేదు. అలాగే పంచేద్రియాలలో ప్రధానమైన శ్రవణేంద్రియం చెవి  దానికి పోషణంగా శాస్త్రాన్ని గురించి మాట్లాడాడు పోతన  శాస్త్ర విషయాలు తెలియకుండా మాట్లాడడం అన్నది చొప్పదంటూ మాటలాగా కనిపిస్తాయి తప్ప అర్థవంతమైనవి కావు  అని శాస్త్రజ్ఞులు ధ్రువీకరించాడు  ఈ శరీరాన్ని అద్భుతంగా తయారు చేయడం కోసం అందంగా కనిపించడం కోసం ఎన్నో ఆడంబరాలను ఏర్పాటు చేసుకున్నాడు మనిషి ఆభరణాలను వస్త్రాలను  మిగిలిన అంశాలతో ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటాడు. దీనివల్ల ఏమిటి ప్రయోజనం నీవు మరణించిన తర్వాత ప్రతి అలంకారాన్ని తీసివేస్తారు. నగ్నంగానే నిన్ను కాల్చి వేస్తారు అన్న విషయం తెలియక  నీకు కావలసిన అలంకారాలను వదులుకుంటున్నావు అని శాస్త్రజ్ఞుడు మనకు హెచ్చరిక చేస్తున్నారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం