అమ్మ చేతి వంట;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలూ ఈ ప్రపంచంలో ఎవరైనా  తనను 9 నెలలు మోసి కానీ ఈ భూమి మీద  అద్భుతమైన కావలసిన సకల సౌకర్యాలు కలిగిస్తూ  రాత్రింబవళ్లు అతనికి సేవచేసిన కన్నతల్లిని ఎవరైనా మర్చిపోతారా. రాక్షసుడు అయిన  రావణాసురుడు ఉదయం లేవగానే తల్లి పాదాలకు నమస్కారం చేసి తక్కిన కార్యక్రమాలను ప్రారంభిస్తారు మరి మనం ఎలా చేస్తున్నాం నిజంగా అమ్మకు గౌరవం ఇస్తున్నామా లేదా అది మన అంతరాత్మకు  అమ్మ భౌతికంగా మనల్ని వదిలి వెళ్ళినా ఆ అమ్మ  చిత్రం మన హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.  దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. రక్తానికి రక్తంగా  పెంచిన తల్లి  తనకేదైనా చెడు జరిగితే తనకు జరిగినట్లుగా బాధ పడే అమ్మను మరిచిపోయే దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఉంటాడా.
మరి పెళ్ళై భార్య వచ్చిన తర్వాత తాను వంట చేసినా  తనను మెచ్చుకోకుండా మా అమ్మ చేసినవాడు అని ఎత్తిపొడుస్తూ ఉంటాడే  దానికి కారణం ఎప్పుడైనా ఆలోచించారా  మానసిక విశ్లేషకుడు చెప్పవలసిన విషయం  భార్య తన పుట్టింట్లో తన తల్లి చెప్పిన పద్ధతిలో  ఆమె ఎలా వండి వార్చిందో  ఆ పద్ధతినే బిడ్డ నేర్చుకుంటుంది కదా  ఆ కనీస గుర్తింపు కూడా లేకుండా భర్త ఆ మాట అంటే  తాను ఏ తప్పు చేయకుండానే తప్పు చేసినట్టుగా ఆయన నిందిస్తూ మాట్లాడినప్పుడు ఆ కొత్త కోడలు మనసు ఎలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామా అన్నంత విరక్తి కలుగుతుంది జీవితం మీద  ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మీలో ఎవరైనా ఆలోచించి చెప్పగలరా  నన్నే చెప్పమంటారా  అనగానే పిల్లలంతా మీరే చెప్పండి అన్నారు. ఇంత క్రితం మీకు సగమే చెప్పాను  భర్త దిప్పిపొడిచిన తరువాత కొడుకు వచ్చి భోజనం చేస్తూ అమ్మా ఇంత రుచిగా ఇంకా ఎవరూ చేయరమ్మా  చాలా బాగా చేశారు  అంటే భర్త మొహం ఎలా ఉంటుంది  దీనివల్ల గ్రహించవలసినది ఏమిటంటే  బిడ్డ పుట్టిన దగ్గరనుంచి  ఉగ్గుపాలతో మొదలై  ప్రతి వంటకం అమ్మ చేతి రుచి చూసినవాడు  ఎవరు ఎలా చేసినా పొరుగింటి పుల్ల కూర అని తినకుండా మానివేసేవాడు  అలాంటి వాడికి భార్య వంట ఎలా నచ్చుతుంది  నిజంగా దానిలో రుచి లేకపోతే కొడుకుకు కూడా నచ్చక పోవాలి కదా  ఇది మానసిక సంఘర్షణ తప్ప వ్యక్తిగత విషయం కాదు అని గమనించాలి  కనక తల్లి చేసిన వంటకాలు రుచికరంగానే చేస్తారు అన్న విషయం గమనించినట్లయితే  ఏ భర్త  తన భార్యను అలా అనడు అన్న విషయం  స్పష్టం  కనక  ఎదుట మనుషుల తత్వాన్ని అర్థం చేసుకునే గుణం మీకు అలవాడాలి  అది తెలుసుకుంటే చాలు జీవితంలో.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం