దీపాల తోరణాలు;- ;-డా.నీలం స్వాతి చిన్న చెరుకూరు గ్రామం, నెల్లూరు.6302811961.
 కలతలు నలతల 
కన్నీటి చరితలకు 
కాసేపు కళ్ళాలు వేసి
వాకిళ్ళకు దీపాల తోరణాలను సిద్ధం చేద్దాం...
పంతాల పట్టింపుల 
గీతలను చెరిపి...
రంగురంగుల ముగ్గులతో
మెరిసిన లోగిళ్ళ వేడుక చూద్దాం...
నిరాశా, నిస్పృహలను 
విడిచి పెట్టి
మమతల పూదోటలో
చిరునవ్వుల పువ్వులను
పూయిద్దాం...
కుల,మతాల వివాదాలకు
వీడుకోలు పలికి...
అందరం ఒకరన్న భావంతో ప్రయాణాన్ని కొనసాగిద్దాం...
పేద ధనిక అన్న హద్దులను చెరిపి
పరులన్న భేదాలు చూపక ప్రతి ఒక్కరితో 
స్నేహం చేద్దాం...
స్వలాభాల స్వార్ధాల 
అజ్ఞానానికి స్వస్తి చెప్పి
ఉజ్వల జ్యోతి ప్రతిమల వెలుగులలో నవ వేకువను చూద్దాం...

కామెంట్‌లు