అసంతృప్తి ఆజ్యాన్ని పోసింది;- డా.నీలం స్వాతి చిన్న చెరుకూరు గ్రామం, నెల్లూరు. 6302811961
 చీకటి కనుమూయగా తూరుపు తెల్లారింది...
రెక్కల చప్పుళ్ళు విని "కల" కను చెదిరింది...
సై అంటూ రోజువారీ యుద్ధానికి సమయం సిద్ధమయింది...
పొట్టకూటి కోసం కూలీల పయనం
యధాతధంగానే మొదలయ్యింది...
సుదీర్ఘపు గమనాలలో ప్రతీ నిమిషం 
ముళ్లే కాళ్ళకు గుచ్చుకోగా...
ఎడారి ఏకాంతంలో గాయాల పాదాల
నడక నరకప్రాయమయింది...
నిరాశా నిస్పృహల సెగలకు కన్నీరు 
కూడా ఇంకిపోయింది...
ఆకలి దప్పులు బాధించగా మెతుకుల 
కోసం బ్రతుకు బేరమాడింది...
కాయకష్టాల వేతనాన్ని 
కోరగా రక్తం విలువను లెక్కగట్టింది...
చేజిక్కిన ఫలాలను మూటగట్టుకుని
బాటసారి నావ గూటికి చేరింది...
విశ్రాంతి లేని ప్రయత్నాల పోరాటాలలో 
కేవలం అశాంతి మాత్రమే మిగిలింది...
గుండె మంటల్లో అసంతృప్తి నిప్పురవ్వై
రేగి కొత్త ప్రయత్నాలకు ఆజ్యాన్ని పోసింది...


కామెంట్‌లు