ఎందుకోమరి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 తగదని తెలిసినా 
తపన ఆగదు ఎందుకోమరి...
తదేకంగా చూసినా 
తనివి తీరదు ఎందుకోమరి...
ఆమె ఎదురైతే 
అడుగు ముందుకు సాగదు 
ఎందుకోమరి...
వద్దని వంద చెప్పినా
నా మనసు మాత్రం మారదు 
ఎందుకోమరి...
ఎన్నాళైనా ఇన్నాళ్ళకూ
చెదరని మా స్నేహాన్ని 
పదే పదే తలచుకున్న...
నా జీవితమనే కొత్త పుస్తకం పై ముఖచిత్రం
తనదేనని తెలుసుకున్నా...
చెలిమి చెలిగా చేరువవ్వగా చేరిపేయాలని 
అనుకుంటే ఆ హద్దులని...
కాలమనే సంతకం దూరంగా వెలివేసింది మా ఇద్దరిని...
ఆనాడు పెదవి అంచున 
మౌనమైన నా పలుకులు
మలి మజిలీకి చేరేదెప్పుడో..
గత జ్ఞాపకాలను 
శిలాక్షరాలుగా తీర్చి దిద్దిన నా జాబును ఆమె చదివేదెప్పుడో...
జేబు వెనుక దాగిన నా జాబిలి నాకు జవాబు ఇచ్చేదెప్పుడో..


కామెంట్‌లు