కాల ప్రవాహం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కాలాన్ని ఒక ప్రవాహంతో పోల్చి మాట్లాడుతారు మన పెద్దలు. మనం మాట్లాడుకుంటూ సహజంగా వెళుతున్న కాలాన్ని  జరుగుతున్న కాలం అనుకుంటూ మాట్లాడతాము  ఇది ఎన్ని క్షణాలు ఉంటుంది  ఒక్క క్షణంలో మనం మాట్లాడింది గతంలోకి వెళ్ళిపోతుంది మరో క్షణంలో మనం మాట్లాడబోయే మాట భవిష్యత్తులోకి వస్తుంది  ఈ మాటను సమన్వయపరచుకుంటూ మానవుడు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు చరిత్రలో మిగిలిపోయే పనులు చేసిన మహానుభావులు ఈ ప్రపంచానికి శాశ్వతంగా గుర్తుండేలా నిలిచిపోయారు. భౌతికంగా వారు మరణించినా శాశ్వతంగా వారి పేరు నిలిచి ఉంది. అక్షరాస్యులలోనూ నిరక్షరాస్యులలోనూ కూడా  చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రతి ఒక్కడు ప్రయత్నం చేయాలి అని కాలం మనకు చెప్తుంది. ప్రవాహాన్ని ఒక్కసారి మీరు గమనించండి కృష్ణా నదిలో నీటిని  కింది వారికి అందించడం కోసం కాలువల ద్వారా పంపిణీ జరుగుతుంది  ఏలూరు కాలవని బందరు కాలవని, రవీస కాలవని   వాటికి పేర్లు  ఏలూరు కాలువలో వచ్చినటువంటి నీటిని ఎలా సద్విని యోగం చేసుకుంటారు  ఏ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి అతి దగ్గరలో ఆ ఏలూరు కాలువ నుంచి  ఒక పాయను చీల్చి  కొంత నీటిని వారు  పంట పొలాలకు వాడుకుంటారు  ఆ ఏర్పాట్లు లేకపోతే మానవజాతికి భోజనమే లేదు  ఈ ప్రవాహం ప్రారంభానికి ముందు ఆ కాలువలో  రకరకాల పదార్థాలు  ఉన్నాయి  పశువుల కళేబరాల నుంచి  ప్రతి వస్తువుని కాలవలో వేయడం మనకు అలవాటు  వాటిని అన్నిటినీ తనతో పాటుగా తీసుకువెళ్లి చివరకు సముద్రంలో కలపడం ఆ  కాలం అనే కాలువకు అలవాటు ఇది ప్రకృతి.
బాలుడు మీరందరూ ఇక్కడ చదువుకోడానికి వచ్చారు అక్షరాలను బట్టీ పట్టి దాన్ని మనసులో దాచుకోవడం కాదు  ఏ అక్షరాల వల్ల ఏ విషయాన్ని మీరు తెలుసుకున్నారు  ఆ విషయాన్ని లోతుగా ఆలోచించి అలా కావడానికి కారణం ఏమిటో తెలుసుకొని  అలాంటి అద్భుతమైన కార్యాలను మనం ఎందుకు చేయకూడదు అన్న పట్టుదలతో మీరు ముందుకు కొనసాగినట్లయితే  దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు గాంధీని ఎలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో  అలాగే మన వాడుతున్న ప్రతి వస్తువును తయారు చేయడానికి ఒక శాస్త్రజ్ఞుడు ఎలా  తన ప్రజ్ఞా పాటవాలను ఉపయోగించుకున్నాడో  అలా మీరు కూడా మీ బుర్రను ఉపయోగించి కొత్త విషయాలు చెప్పగలిగితే  ఆ మహానుభావుల స్థాయిలో  వారిలా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు  మరి మీరందరూ దానికోసం  ప్రయత్నం చేస్తారు కదా.కామెంట్‌లు