అంతరంగాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తరుముతూ తరిగే
తరుణాల, ఉదయపు 
ఉజ్వల కిరణాల,
అస్తవ్యస్తమైన 
జీవితాల, ఖాళీ కాగితాల,
నిలకడ లేని నయనాల,
పోటీ పరుగుల
పయనాలలో, ఆగని 
ఆలోచనల వెనుక,
తీరని ఆవేదనల వెనుక,
పెదవుల నలిగిన
నవ్వుల వెనుక,
తేనెలు చిలికే
మాటల వెనుక,
చెలిమిని కోరే 
చూపుల వెనుక,
రుజువులు లేని
రూపు రేఖల వెనుక, 
మెప్పించే ఘటనల వెనుక, 
నొప్పించే నటనల వెనుక, 
మతిస్థిమితంలేని
మనసు పొరల వెనుక దాగిన
అనంత అంతరంగాలను
అన్వేషించడం, అక్షరాలుగా
అభివర్ణించడం అంటే,
చిన్న పనేమీ
కాదుగా మరి....!!!


కామెంట్‌లు