వసుధైక కుటుంబం;- ఎ.రాజ్యశ్రీ 8985035283
యుజ సంస్కృతపదంలోంచి
ఉదయించే యోగా
న్యూయార్క్ లో మోదీజీ భారత యోగాని చేసే విశ్వవ్యాప్తంగా
ధ్రువాలు మొదలు అన్ని దిశల
పాపాయి మొదలు సిపాయి దాకా యోగా తో జోష్ గా ఉషారుగా వసుధైక కుటుంబకం థీమ్ తో సాగేను

శరీరం బుద్ధి మనసు ఆత్మ పరమాత్మ అన్ని ఏకత్రాటిపై నడిచే యోగా!
భగవద్గీత ఉపనిషత్తుల్లో పతంజలి క్రోడీకరించే అష్టాంగ యోగం

శాంతిపర్వం లో భీష్ముడు యోగప్రక్రియను జీవనరథంగా అభివర్ణించే
ఆహార విహారాలలో క్రమశిక్షణ
మానసిక ఒత్తిడి తగ్గు
ఆరోగ్యానికి మూల స్తంభం

కులమతజాతి ప్రాంతాలకి అతీతం
వయసు స్త్రీ పురుష భేదం లేని
జీవన వేదం

డబ్బు ఖర్చు లేని రకరకాల ఆసనాలు ప్రాణాయామంతో
చీకు చింతా పటాపంచలు
శరీరం మనసు యుగళగీతం ఆలపించు
లయతో కండరాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆసనాలు తో
బుద్ధి వికసించు
ప్రాణాయామం తో ప్రశాంతత

ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా
దివ్యాంగులతో సహా ఉత్తేజం
గిన్నిస్ బుక్ లో కెక్కిన యోగా

ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువ కాలం యోగాదినోత్సవంకి అనుకూలం!
ప్రతి బడి గుడి లో యోగ సాధన జీవన్ముక్తికి సోపానం!
.. స్వస్తి..

కామెంట్‌లు