ఆధ్యాత్మికం;-మమత ఐలకరీంనగర్9247593432
తే.గీ
శివుని చల్లని యొడిలోన  చింతలన్ని
దీరుటేగాక గతజన్మ పోరులెన్నొ
స్వామి దయతోడ దేల్చేము చక్కగాను
నీశ్వరుని కన్న మిన్నగానెవరు గలరు

తే.గీ
ఈశ్వరార్చన కన్నను యేదిమిన్న
భక్తితో బిలువ భగవాన్ వచ్చు జూడు
కష్ట మందున్న లెక్కల ఖాత విప్పి
నండ దండగా నుండేను నడవమనుచు


కామెంట్‌లు