పంచపది;- ఉద్యమ ఆధ్యుడు!జనహృదయ ఆరాధ్యుడు!; - డా.పి.వి.ఎల్. సుబ్బారావు,- 94410 58797.
 నా పంచ పదుల సంఖ్య---
897.
 తెలంగాణ ఉద్యమ, పరిమళాల మల్లి కొత్తపల్లి! 
ఉద్యమ "జయశంకరం", ధన్యం, కన్న తెలంగాణ తల్లి! 
తెలుగు ,ఇంగ్లీషు, ఉర్దూ,
 హిందీ భాషల పరిఢవిల్లి!
 
ఆజన్మ బ్రహ్మచారి ,
ఉద్యమ దేవతకు ప్రణమిల్లి! 
తెలంగాణ పోరాటాన నిలిచే, మచ్చలేని జాబిల్లి, పివిఎల్!
898.
అధ్యాపకుడు ,ఉన్నత, పదవులు అలంకరించాడు! 
వృత్తి నిబద్ధత, ఉద్యమ, చిత్తశుద్ధి, కలిగించాడు! 
ఎమర్జెన్సీలో సైతం,
 కళాశాలను నడిపినవాడు! 
విద్యార్థి పేరు గుర్తుంచుకున్న, గురువుగా నిలిచాడు ,
ఆయన విద్యార్థులు ఎందరో, ఉత్తములు అయి ఉన్నారు ,
పివిఎల్!
899.
తొలి తెలంగాణ నాన్ ముల్కీ ఉద్యమాల నేతృత్వము! 
ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత, గ్రంథ రచనము!
 
ఢిల్లీ అమెరికాలలో ,
ఉద్యమరణ విస్తరణము!
 టిఆర్ఎస్ సలహాదారుడు ,
సరి మార్గదర్శకత్వము! 
తెలంగాణ సాకారం, కాంచకుండానే, స్వర్గారోహణము, పివిఎల్!
900.
మాకు వనరులు ఉన్నాయి, అధికారం కావాలన్నాడు!
 
యాచక దశ దాటి ,
నిజ శాసనదశ. కాంక్షించాడు! 
కాల్పులకు గురైతే తాను, అమరవీరుడు అన్నాడు!
 బతికి ఉండి చేస్తున్నది ,
ఘోరాలు చూస్తున్నా అన్నాడు! 
తెలంగాణ ఉద్యమసిరి ,
     జయశంకరుని ఊపిరి ,
                       పివిఎల్!
901.
"తెలంగాణలో అభివృద్ధి,
 శీఘ్రం గానే జరుగుతుంది!" 
"నీళ్లల్లో వాటా వచ్చి ,
జనవరుల స్వేచ్ఛ ఇస్తుంది!"
"చెరువుల పునరుద్ధరణ, పచ్చదనం పిలుస్తుంది!" 
"తెలంగాణ ప్రజాస్వామ్య, సంస్కృతి వెల్లి విరుస్తుంది!" 
ఆయన ఆలోచనలు నిజం, విప్లవ చైతన్యం కారణం,
పివిఎల్!
________


కామెంట్‌లు