పంచపది,- ఉద్యమశరధి! సాహిత్యసారథి!;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు 94410 58797.
 నా పంచ పదుల సంఖ్య--
852. 
ఓ కృష్ణుని తమ్ముడైన, ఈ,రంగడు పోరాట యోధుడు!
ప్రభుత్వాన ఉద్యోగి, 
           ఉపాధ్యాయుడు,
                   గ్రంథ పాలకుడు!
 
  ఆంధ్ర మహాసభ ,
       ఆర్య సమాజాల,   
               నిజప్రభావితుడు !
సనాతన కుటుంబం, అభ్యుదయభావాలపాలకుడు! 
విప్లవ భావాల ప్రజ్వలనం, నిజాంని ఎదిరించాడు, పివిఎల్!
853.
కుటుంబ కలహాలకారణం,   
         బాధ్యతల స్వీకరణము!
 
సాయుధ  పోరాటాన,    
     స్వయంగానే పాల్గొనడము! 
బుల్లెట్  ప్రాణాపాయం సైతం,
ధైర్యంగా ఎదుర్కోవడము!
సతతము పోరాటమే,
 ఊపిరి అయిన జీవితము! 
తరువాతి తరానికి,
 ఆదర్శనమూనా వ్యక్తిత్వము, పివిఎల్!
854.
"చిల్లర దేవుళ్ళు" సాయుధ, పోరాట మునుపటి స్థితి!
" మోదుగు పూలు" సాయుధ,  
     పోరాటాన.  ఉన్న పరిస్థితి!
" జనపదం"లో పోరాటానంతర,
             వాస్తవ పరిస్థితి !
"వట్టికోట", "ప్రజల మనిషి",
         "గంగు"లో జీవనస్థితి!
 "చిల్లర దేవుళ్ళు", సినిమా, రేడియోనాటకంగా ఖ్యాతి, 
పివిఎల్!
855
."ఆత్మకథ" జీవన యానంలో,
     అందించిన సాహిత్యము!
వేదం లిపి బద్దం, శాశ్వతముద్ర,
             సాహితీ విప్లవము !
ఆంధ్ర సాహిత్య అకాడమీ,   
      పురస్కార స్వీకరణము!
వేదాల అనువాదం ,
      "ఆంధ్ర వ్యాసుడు",
             జన విఖ్యాతము !
తెలుగు విశ్వవిద్యాలయం చే, విశిష్ట పురస్కారము,పివిఎల్!
_________


కామెంట్‌లు