నలభీమపాకం (జాతీయం వెనుక కథ ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
  మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యత వహించేది భోజనమే. ప్రతి మనిషి రోజూ అత్యంత రుచిగల ఆహార పదార్థాలు తినాలని కోరుకుంటా వుంటాడు. ఎవరైనా సరే మన మనసును దోచే విధంగా కమ్మని వంట చేసి పెడితే, ఆ రుచికి పొంగిపోయి ఆహా! నలభీమపాకంలా ఎంత రుచిగా వుందో అని చేసిన వాళ్ళను పొగుడుతా వుంటారు.
   కొందరు వంట చేస్తే మరలా మరలా తినాలనిపిస్తుంది. కొందరు చేస్తే ఎందుకు బతుకుతున్నాంరా భగవంతుడా అనిపిస్తుంది. వంట చేయడం గూడా ఒక పెద్ద కళ. అన్నీ సమపాళ్ళలో సమయానుసారం కలిసినప్పుడే ఆ కమ్మని రుచి సాధ్యం. నిజానికి ఇళ్ళలో వంట వండేదంతా స్త్రీలే అయినా విచిత్రంగా హోటళ్ళలో, పెళ్ళిళ్ళలో పెద్ద ఎత్తున రుచికరమైన వంటలు చేస్తున్నది మాత్రం మగవాళ్ళే. పూర్వకాలం నుంచీ ఈ సంప్రదాయం ఇలాగే సాగుతుంది.
నలుడు, భీముడు వంట చేయడంలో ప్రసిద్ధులని ఇతిహాసాలనుంచి గ్రహించవచ్చు. భీముడు మొదటినుంచీ భోజన ప్రియుడే. అందుకే తినడంతో బాటు చేయడం గూడా నేర్చుకొని వుండవచ్చు. అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో వలలుడు అనే పేరుతో వంటవానిగా చేరాడు. రాజును వివిధ రకాలైన కమ్మని వంటలతో మెప్పించాడు. ఎటువంటి ఆహార పదార్థాలనయినా నోరూరించేలా చేయగల నేర్పరి అతడు.
ఇక నలుడు గూడా అంతే, రాజయినప్పటికి విధి ప్రభావంచే అన్ని కోల్పోయి చివరికి బుడుపరుడు అనే రాజు వద్ద బాహుకుడు అనే పేరుతో వంటవానిగా కుదిరాడు. నిజానికి నలుడు పెద్ద వంటగాడేమీ కాదు. ఒక వార్తా ప్రభావం చేత నలుడు ఎలా వంటచేసినా దానికి అద్భుతమైన రుచి వచ్చి తినే వాళ్ళు మైమరిచిపోయేవారట. అందుకే అత్యంత రుచికరమైన వంటలు చేసే వారిద్దరి పేర్లను కలిపి "నలభీమపాకం" అనే జాతీయం పుట్టింది.
నలభీమపాకం అంటే నోరూరించే పాకమని అర్థం
*********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం