మైదాకు స్వగతం- మైదాకుకు స్వాగతం; - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి విశ్రాంతి సహాయాచార్యులు హైదరాబాద్ 9490367383
నేను గోరింటాకుని
ఆషాదం వచ్చిందంటే చాలు
ఆడపడుచులు నాకోసం
ఆవురావురంటూ ఎదుచూపులు!!
 
నేను పచ్చపచ్చ గా ఎదుగుతాను
అందరికి ఆకర్షణీయంగా ఉంటాను
కొద్దిగా రక్షణ కవచంలా ముళ్ళు
అందమైన గులాబీ నాకు దోస్త్!!

అయినా నా ఆకులు కోసేసి
నన్ను మెత్తగా రుబ్బేసి
చేతులకు రకరకాలు
డిజైన్ లతో
అలంకరించుకుని మురుస్తారు!!

నాలోవున్న అనురాగం  రాగం(ఎరుపు)
వాళ్ళ చేతులు కాళ్ళు
ఎర్రగా చేసి మురిపిస్తాను
ఆనందంతో అందంగా ముస్తాబై
కనులవిందు చేస్తారు

కొందరు నన్ను మందులాగా 
నోట్లో ముద్ద వేసుకుని
ఆరోగ్యాన్ని కూడా రక్షించుకంటారు!!

నా శరీరం ఆకుపచ్చ
నా మనసు ఎరుపు
నేను ఆషాఢ సుందరిని
అంతేకాదు అన్ని శుభకార్యాలలో
నాట్యంలో 
అందంగా అలంకరించుకొన
నాదే అగ్ర స్థానం
మెహింది డే అంటూ నాకో రోజు ప్రత్యేకం!!

నేను లేక మీకు ఆనందం లేదు
అందం ఇనుమడించు
నేనే మీ చేతుల్లో పందుతాను
పూవు లేక పూస్తాను
ఆకుతోనే! పత్రంతోనే!!

మీ మగువల మనసు దోచిన
అనురాగ మూర్తిని
సరాగ సుందరిని
నేను గోరింటాకుని!!

మైదాకు  మీద మోజు
మగువలకు 
కాత లేదు పూత లేదు
ఆకుతోనే రాగం
పండును ఎరుపు
అనురాగం అనుబంధం
ఆత్మీయత 
జీవన రాగం
ప్రియ రాగం 
బ్రతుకు పర్వం!!

మెయిని రక్షణ
మైదాకు
గోర్లకు రక్షణ గోరింటాకు!!

ఆరోగ్యం
ఆనందం
ఆహ్లాదం!!

--------------------


కామెంట్‌లు
Janardhan Thumma చెప్పారు…
పచ్చని మెహందీ ఎర్రగా పండింది. మీ కవిత కూడా అంతే.
అభినందనలు మేడం.
కొమ్మలు లేకుండా పూచే పువ్వులు
మగువల చేతుల్లో మురిసే రెమ్మలు
ముద్దు గుమ్మలకెంతో మురిపెం
మనువాడే ముగ్ధకు మందారమే అందం
.. శిరందాస్ శ్రీనివాస్

మైదాకు మహిళల మనసాకు
బావుంది...
కొమ్మలు లేకుండా పూచే పువ్వులు
మగువల చేతుల్లో మురిసే రెమ్మలు
ముద్దు గుమ్మలకెంతో మురిపెం
మనువాడే ముగ్ధకు మందారమే అందం