భేద భావానికి స్వస్తి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
మానవ జన్మ ఎత్తిన ప్రతి వారి  మనసు స్వార్థంతోనే నిండి ఉంటుంది  ఆ స్వార్థం  పరిమితిలో ఉంటే పరవాలేదు కానీ దానిని దాటి కొంచెం ముందుకు వెళితే  స్వార్థపరుడు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు  తాను తన భార్య తన కుటుంబం తన బంధువులు  తన స్నేహితుడు అని ఆలోచిస్తూ  వీరితో ఉన్న సత్సంబంధాన్ని  కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు తప్ప  బయటివారు ఎవరు వచ్చినా  వారు మీరు  తమరు అనే  సంబోధిస్తూ  తాను వేరు  అవతలి వారి వేరు అన్న భేద భావంతో  చూడడం  మానసికంగా చాలా చెడ్డది  భౌతికమైన విషయాలలో కూడా  అనేక కార్యాలకు అడ్డువచ్చే  ఆలోచన  దానిని తగ్గించుకుంటే కానీ  గృహస్తుకు ఉండవలసిన లక్షణాలు ఉండవు అని వేమన మనకు  హెచ్చరిక చేస్తున్నాడు. అసలు శరీర నిర్మాణం ఎలా ఏర్పడిందో తెలియక  అజ్ఞానంలో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు  ఈ జగత్తు మొత్తానికి గురువుగా వ్యవహరించబడే  ఆదిశంకరాచార్యుల వారు  అద్వైత సిద్ధాంతాన్ని అమలుపరచి  దానిని సామాన్య మానవులకు కూడా అర్థం అయ్యేలా ప్రచారం చేసి  ఏదో ఎక్కడో ఉన్నదని తాపత్రయ పడవద్దు  నీవే ఉన్నావు నీలోనే ఉన్నది  నీవు నేను అన్న భేద భావం వదులు  ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు  రెండు ఒకటే అహం బ్రహ్మాస్మి  బ్రహ్మ పదార్థం ఏది ఉన్నది అని నీవు నమ్ముతున్నావో అది నీలోనే ఉన్నది నీవే అది అని  నిర్ణయం చేసిన వాడు శంకరాచార్యులవారు. దానిని తర్వాత ఆధ్యాత్మిక తత్వంతో మాత్రమే కాకుండా భౌతికంగా కూడా ఆలోచించిన మేధావులు ఉన్నారు.
ఈ శరీర నిర్మాణం  సుఖమయ జీవితాన్ని పొందడం కోసం అని ప్రతి ఒక్కరికి దీనిలో ఉన్న భాగాలు ఎలా ఉన్నాయో  అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు జీవితము అన్న అర్థమే రెండు పదాల కలయిక  జీవి తనువు కలిస్తే జీవితం  ప్రాణరహితమైన ఈ తనువులో ఉన్న ప్రతి భాగం  చలనం లేనిదే  దానికి చలనం కావాలి అంటే  మాట్లాడాలన్నా , చూడాలన్నా, వి,  స్పర్శించాలన్నా  అంతర్గతంగా లోపల ఉన్న జీవి  దీనికి అనుగుణంగా స్పందించాలి  దాని స్పందన లేకుండా  ఈ పంచ అవయవములు లో  ఏ ఒక్కటి పనిచేయడానికి సుముఖంగా ఉండదు  కారణం నిర్మాణంలోనే  ఉన్న రహస్యం అది  చలన రాహిత్యంగానే అది ఉద్భవించింది  అది తెలిస్తే చాలు. ఇప్పుడు వేమన వ్రాసిన పద్యం చదవండి. 
"తాను నేనని యడు తప్పులో బెడిదంబు  మాని కడు వివేక మహిమ ధనరీ యూరకున్నవాడు యుత్తమోత్తముడు..."


 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం