మనసు మాయ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
ప్రకృతిలో ఈ జీవుడు  జన్మించడానికి  తల్లి తండ్రి ఉండాలి.  వారి సంగమంలో  శుక్ల శోణిత సమన్వయంతో  తల్లి గర్భంలో బిడ్డ  బీజం  ఏర్పడుతుంది  9 నెలలలో ఆ బిడ్డ తొమ్మిది అవతారాలు గా మారి  ఈ భూమి మీదకు వస్తుంది  దీనిని దశావతారాలు అని భౌతిక శాస్త్రం  చెబుతోంది  దశ అంటే 10 అని అర్థమే కాకుండా స్థితి అని అర్థం కూడా ఉంది  దానిని కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు  మత్స్యకూర్మ వరాహ అంటూ  ఆ అవతారాలను చెప్పుకుంటూ వెళతారు  అది ఆధ్యాత్మిక స్థితి  ఈ తొమ్మిది నెలలలో  బిడ్డ  అన్ని అవయవాల  నిర్మాణంతో పెరుగుతుంది  కొన్ని సందర్భాలలో  కొన్ని అవ లక్షణాలు  కలిగిన బిడ్డలు కూడా  ఈ భూమి మీదకు రావడానికి అవకాశాలు ఉన్నాయి  మనం ప్రత్యక్షంగా చూస్తున్న విషయమే ఇది.
ఈ శరీరానికి కావలసిన పంచేంద్రియాలను  జ్ఞానేంద్రియాలను ఏర్పాటు చేసుకుని  ఆ బిడ్డ ఈ భూమి మీదకు వస్తుంది  మనకు బయట కనిపించే  కాళ్లు చేతులు మొహం  ముక్కు నోరు ఇవి కాకుండా  శరీరం మొత్తానికి మనసు ప్రధాన పాత్ర వహిస్తుంది  శారీరకంగా మనసులో ఉన్న వెన్నుపూస  ఆలోచనలకు కేంద్రం  అని శాస్త్రవేత్తలు నిర్ణయించారు  రకరకాల ఆలోచనలు చేసి  కుండలి నుంచి సహస్ర వరకు  ఆ నిర్ణయాన్ని తెలియజేస్తూ  ఉంటుంది  దానిని చిన్న మెదడు పెద్ద మెదడు  ఎంతవరకుదానిని వాడుకోవాలో  తెలుసుకొని దాని ప్రకారం ఏర్పాటు జరుగుతాయి  శాస్త్రీయంగా జరిగే  ఈ ప్రక్రియ సహజసిద్ధంగా ప్రతి శరీరానికి  ఉన్నది  ఇది ప్రకృతి ప్రసాదించిన  వరం నిజానికి
మనిషి బజారులో వెళుతున్నప్పుడు  తన కంటితో చూసిన ప్రతి వస్తువు పైన  వెన్నుపూస మనస్సు పడుతుంది  ఈ మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తుంది  అది తీసుకుంటే ఎలా ఉంటుంది తీసుకోకపోతే నష్టం ఏమిటి  అది తీసుకోవడానికి సరిపడిన వనరులు మన దగ్గర ఉన్నాయా  వీటన్నిటినీ ఆలోచించి  చివరకు మెదడు వల్ల నిర్ణయం జరుగుతుంది  అది మంచి కావచ్చు చెడు కావచ్చు  మంచిగా ఆలోచించి ఆ పని చేస్తే మంచి ఫలితం దక్కుతుంది  చేయకూడని పని చెడ్డది అయితే  దాని ఫలితం కూడా  ఆ పద్ధతిలోనే ఉంటుంది  శరీరంలో ఏభాగం  పాడైనా దానిని సరి చేసుకోవచ్చు  వెన్నుపూసను తయారు చేసేవాడు  లేడు  కనుకనే పూసనియంతలా ప్రవర్తిస్తుంది. ఇలా మాయలు చేసే  మనసుని తెలుసుకోవడం కష్టం ఆ తెలుసుకున్న వాడే యోగి  పరిపూర్ణ మానవుడు అని చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని గురించి వేమన వ్రాసిన పద్యాన్ని చదవండి.

"మది నెరింగిన వాని మహిగనమెందును  మదినెరుంగు నరుడు మహిని నరుదు వెదకి తనవులోన వేడ్కతో నిను జూచు..."

 

కామెంట్‌లు