శరీర లక్షణం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మనిషి మనిషిగా జీవించాలి అంటే తన మనీష బాగా పని చేయాలి. మనీష అంటే బుజ్జి  ఆ బుద్ధి లేనివాడు దేనికి పనికిరాకుండా పోతాడు అసలు తన శరీర నిర్మాణం తెలుసుకోవాలి  ఏ అవయవం ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలియకపోతే  దానిని నియంత్రించే పద్ధతి ఎందుకు తెలుస్తుంది కనుక ముందు ఏ నరం పనిచేస్తే శరీరానికి ఏ మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది  అన్న విషయాన్ని అవగాహన చేసుకుని ముందుకు వెళితే  ఈ శరీరం ద్వారా తాను సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏది ఉండదు  ప్రతిదీ  తన కరతలామలకం  అవుతుంది  దానికోసం ప్రయత్నించాలి ప్రతి వ్యక్తి  ఏమి తెలియకుండా చేసిన పని  ఫలితాన్ని ఇవ్వదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ముందు  తత్వం తెలియాలి  తత్వము అంటే  ఏదైతే ఉన్నదో అది నేను  అన్న విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే  ఏ అవయవం దేనికి పనికొస్తుంది  అన్నది తెలిస్తే ఆ అవయవంతో ఆ పనిని చేయించవచ్చు  అలా తెలిసి చేయడం చాలా తేదికగా అనిపిస్తుంది  మూల సిద్ధాంతం తెలియకుండా  విషయ పరిజ్ఞానం కావాలి అనుకునే వాడికి  అసలు ఏ విషయమైతే ఉన్నదో దానిని గురించి  ఓనమాలు కూడా తెలియవు  కనుక తన జ్ఞానంతో  ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడో దానికి ప్రాధాన్యతను ఇచ్చి దానిపైనే మనసును కేంద్రీకరించి అది తెలుసుకోవడానికి ఉపక్రమించాలి  అప్పుడు తప్పకుండా తన కార్యాన్ని సిద్ధించుకునే అవకాశం ఉంటుంది  లేకపోతే కష్టం అంతా వృధా అయిపోతుంది.
శరీరానికి కన్ను ఉన్నది కదా అని ప్రతి విషయాన్ని  చూడకూడదు  కావలసిన విషయం కోసం మాత్రమే  దానిని వినియోగించుకోవాలి  అలాగే నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడకూడదు  దాని పరిధి దాటకుండా  ఉండాలి. అలాగే ప్రతి అవయవానికి  నియమ నిబంధనలను పెట్టుకొని ఆ అవయవం ద్వారా చేయవలసిన చేయగలిగిన పనులు మాత్రమే చేస్తూ ఉండాలి  లేకపోతే అనేక అనర్థాలను కొని తెచ్చుకున్న వారవుతారు. అలా కాకుండా  వేరే విధంగా ప్రవర్తిస్తే మాత్రం  ఎంతోమందికి వ్యతిరేకులు కావాలి  అలాకాకుండా చేయవలసిన పద్ధతిలో చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అలా ఉన్నవారు మాత్రమే సమాజంలో  మంచి పేరు సంపాదించుకుంటున్నారు  అంటున్నాడు  వేమన  తాను రాసిన ఆ పద్యాన్ని చదవండి.

"తనదు  దేహమందు తనకున్న  పరివారమందరి  బిలిపించి  హర్ష మొనగనల్ల  చావు గెలిచి  ఇందందు మెరిగియు  నడువ నేర్చు నాతడదురు వేమ..."


కామెంట్‌లు