ప్రకృతి విలయ తాండవం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఆకాశవాణి కేంద్రాలు సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని  వారికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటారు  ప్రత్యేకించి వ్యవసాయదారులకు  సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు  అవసరమైన వాతావరణ పరిస్థితులను ఏరోజుకారోజు  రెండు మూడు పర్యాయములు  తెలియజేయడం కోసం  వాతావరణ పరిశోధన కేంద్రం వారు  ప్రతి పూట సమాచారాన్ని ఆకాశవాణి కేంద్రానికి పంపిస్తూ ఉంటారు వాటిని  వారు ఆంగ్లంలో ఇ చ్చిన విషయాన్ని తెలుగులో తర్జుమా చేసి  ప్రసారం చేస్తారు  చాలా పర్యాయాలు రేడియోలో చెప్పినా వర్షం రాకపోవడం కానీ  చెప్పకపోయినా రావడం కానీ  అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది  ఆకాశవాణిని నమ్మడం జరగదు.
కొంతమంది ధైర్యం చేసి  ఆకాశవాణి వారు అబద్ధాలు తప్ప నిజాలు చెప్పరా  ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు అని అడుగుతూ ఉత్తరాలు వ్రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి  అయితే ఆకాశవాణి వారు చెప్పే సమాధానం  వాన రాకడ ప్రాణం పోకడ  అన్న నానుడిని ఆధారం చేసుకుని  ఆ విషయాలు చెబుతాము ఆకాశవాణిని ఎప్పుడు నమ్మని జాలర్లు  దివిసీమ ఉప్పెన  సందర్భంగా సముద్రంలోకి వెళ్లిన అనేకమంది జాలర్లు చనిపోవడం  అమాయకపు ప్రజలు  ప్రకృతిని ఆస్వాదించడానికి సముద్రతీరానికి వెళ్లిన వారు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు  అప్పటినుంచి  రేడియోలో చెప్పిన కార్యక్రమాన్ని నమ్మటం మొదలు పెట్టారు. దివిసీమ తుఫాను సందర్భంగా రాత్రింబగళ్లు  పనిచేసినాయి రేడియో కేంద్రాలు. ప్రతి గంటకు  ఒక పర్యాయం వాతావరణ సూచన చెప్పి  ఏ క్షణాన పరిస్థితి ఎలా ఉంటుందో చాలా జాగ్రత్త వహించమని  సలహా చెపుతూ ప్రసారం చేశారు రేడియో వారు  మేఘాలను చూడగానే వర్షం వస్తుంది అనుకోవడం ఓకే కానీ నిజం కాదు  అలాగే  ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి  మరణానికి సిద్ధమై ఉండి తీరవలసిందే  జాతస్యహి ధ్రువో మృత్యు హు  అన్న వేద సూక్తిని అనుసరించి  ప్రతి ఒక్కరూ దానిని నమ్ముతారు  మరి ఈ ప్రాణం పోకుండా ఉండే ఉపాయాన్ని గురించి ఏ మానవుడైనా ఆలోచించాడా  ప్రయత్నం చేసినాఅది అతని చేతిలో ఉంటుందా  కనుక కాలానికి తల ఒగ్గి జీవించడమే  బుద్ధిమంతుల లక్షణం అంటాడు వేమన. ఈ విషయాన్ని గురించి వేముల వ్రాసిన ఆటవెలది పద్యాన్ని ఒక్కసారి చదవండి.

"వాన రాకడ మరి ప్రాణంబు పోకడ కనపడదు ఘనులకైన గాని కనబడిన మీద కలి ఇట్లు నడుచునా..."  కామెంట్‌లు