గాడిదకు హంగులు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవులలో ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి  పిల్లలు ఒక రకంగా ఆలోచిస్తాడు పెద్దవారు మరొక రకంగా ఆలోచిస్తారు  ఎవరి ఆలోచనలను తప్పుపట్టడానికి వీలు లేదు  సహజంగా వారిలో ఉన్న  కోర్కెలు  నేను చదువుతున్న రోజుల్లో  ఉన్నత పాఠశాల ప్రారంభించిన మొదటి రోజున  మేము ఆరవ తరగతి లో చేరాం  వీరవల్లి నుంచి  ఒక కుటుంబం  తన బిడ్డ చదువు కోసం  వచ్చి అక్కడ అద్దెకు ఒక ఇల్లు తీసుకొని  బాబును ఇక్కడ చేర్చారు  వారు కొంచెం ఆస్తిపరులు అందువల్ల కుర్రవాడికి హ్యాటు, బూటు, సూటు  వేసి బడికి పంపేవారు  ఆ కుర్రవాడిని అలా చూడాలని వాళ్ళమ్మ  ఉబలాటం  కానీ ఇక్కడ కురవాళ్లంతా  ఉపాధ్యాయులతో సహా  అతనిని వేరే కోణంలో చూస్తూ ఉండేవారు ఏ వయసుకు సరిపడినవి వాటికి తగినట్లుగా ఉంటే ఆనందం  చూసేవాడికి కూడా మానవులలో ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి  
మన పెద్దలు ఏం చెబుతూ ఉంటారు అంటే  వస్త్రధారణ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ వయస్సును దృష్టిలో పెట్టుకుని  దానికి తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప  ఎక్కువ తక్కువ చేయడం వల్ల  అనేక రకాలుగా ఇతరులు ఆలోచిస్తూ ఉంటారు  తక్కువ చేస్తే వీడు పాపం చాలా బీదవాడు కాబోలు అందువల్ల తగిన ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారు అని జాలిపడతారు  ఎక్కువ చేసిన వారిని చూస్తే వారికి వింతగా ఉంటుంది. గంగిరెందును ఆడించేందుకు వేసిన  వేషాలు జ్ఞాపకం వచ్చి  పక్కున నవ్వుతారు  కనుక ఎక్కువ వద్దు తక్కువ వద్దు  తన స్తోమతకు తగినట్లుగా  ఉన్నదానిలో అందమైనది  ఏర్పాటు చేసుకున్నట్లయితే సమాజంలో  ఏ ఒక్కరూ వీరిని గురించి ఒక్క మాట కూడా అనుకోరు

"గాడే మేను నిండ గంధంబు బూసిన యేమి ఎరుగలేక యగసి తన్ను నీదు కానీ దానికిష్ట మీలాగురా..."కామెంట్‌లు