లక్ష్మీ స్థలం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రకృతిలో యువతీ యువకులు మనస్తత్వం భలే గమ్మత్తుగా ఉంటాయి  ఆ వయసులో ఎవరిని చూసినా ప్రేమించాలని అనిపిస్తుంది వారిని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది  కానీ వాస్తవానికి అది జరుగుతుందా అంటే కానే కాదు  ఆ అమ్మాయిని ఏమ్మా నీకు ఎలాంటి భర్త కావాలి అని అడిగితే  నాకన్నా బాగా చదువుకున్నవాడు నా కన్నాఅందమైన వాడు ఆస్తిపరుడు కావాలి అని కోరుకుంటూ  దానితోపాటు ఎలాంటి దుర్గుణాలు ఉండకూడదు అని  అదే యువకుడిని కదిలిస్తే  చూడడానికి చక్కటి  అందమైన బొమ్మ లాగా ఉండాలి  నేను ఎలా చెబితే అలా వినాలి  పద్ధతిలో జీవితాన్ని గడపాలి  నేను చదువుకున్నాను కనుక నాకు తగినట్లుగా  నాకు కట్నాలు ఇవ్వడంతో పాటు లాంఛనాలు  కూడా ఎక్కువగానే ఉండాలి.
నిజానికి అందం అంటే ఏమిటి  భౌతికంగా ఎర్రగా బుర్రగా  చూడడానికి నదరుగా ఉంటే అది అందం అనిపించుకుంటుందా  మనసు అందంగా లేకపోయినా తర్వాత ఎన్ని రకాల అందాలు ఆ శరీరానికి ఉన్న అవి వృధా అనిపించవా  కనుక సిరి సంపదలను కోరుకోవడమే కాకుండా  ఆ వ్యక్తిలో కొంచమైనా జాలి గుండె ఉండాలి  అని కోరుకోకపోతే ఆ జంట జీవితంలో  విజయాన్ని సాధించలేరు అంటాడు  వేమన. నిజానికి జాలి గుండె లేని వాని వద్ద  ఎన్ని సిరి సంపదలు పోగై ఉన్నా  ఆ లక్ష్మి తన దగ్గర శాశ్వతంగా ఉండదు  తనకున్న సిరి సంపదలను అన్నిటిని ప్రక్కవారికి పంచి పెట్టమని ఏ ఒక్కరూ అనరు  వారి కష్ట సుఖాలు గమనించి ఆపదలో ఆదుకోవడానికి సరిపడిన ధనాన్ని ఇవ్వడానికి  సహాయకారిగా ఉండాలి.
వేమన  చక్కటి ఉదాహరణ చెబుతున్నాడు మనకు  తేనెటీగ  తేనెను మొత్తం సమకూర్చి ఒక చోట చేర్చి  తేనె పట్టులో దానిని జాగ్రత్త చేసి  దాని దారిని అది వెళ్ళిపోతుంది  అలాగే లక్ష్మీదేవి కూడా ఎవరిని ఆశ్రయిస్తుంది అంటే  తను ఏ సంపాదన తనకు ఇచ్చిందో  దానిని తాను అనుభవిస్తూ  అత్యవసరమైన వ్యక్తులకు ఆ డబ్బును పంచే  మంచి మనసు కలవారిని ఎన్నుకుంటుంది కొంతకాలం అయిన తర్వాత అతనికి తాను అనుకున్న గుణం లేదు అని తెలుసుకున్న లక్ష్మీదేవి  ఆ క్షణాన్నే ఆ గృహం నుంచి వెళ్లిపోవడానికి ఆయత్తమవుతుంది  అంతే తప్ప అలాంటి పిసినారుల వద్ద  ఉండడానికి లక్ష్మి దేవి సుతరాము ఉండడు  అని చెప్తూ వేమన ఆ విషయాన్ని తన ఆట వెలది పద్యం ద్వారా  తెలియచేస్తున్నాడు దాన్ని చదవండి.

"కలిమిగల్గనేమి కరుణ లేకుండేనా  కలిమియెల నిలుచు కర్మలకును తేనె గూర్చి ఈగ తిరుగునబోవదా..."


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం