మత విద్వేషాలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 


ఈ భూమి మీదకు తల్లి గర్భం నుంచి వచ్చే బిడ్డకు కూడా  తన కులం ఏంటో మతం ఏంటో వారు ఏ పద్ధతిని అనుసరించారు ఎలా జీవించాలి  ఏమీ తెలియకుండానే  ఏకాంతంగా వస్తాడు  వచ్చిన వాడు పెరిగి పెద్దవాడై  విద్యాబుద్ధులు నేర్చుకుంటూ  జీవితంలో కొన్ని హద్దులు  కొన్ని నియమాలు పెట్టుకుంటాడు. దీనిని పెద్దలు ఎలా అనుసరిస్తున్నారు  తన కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఏ పద్ధతిలో మెలుగుతున్నారు  అన్న విషయాలన్నిటినీ గమనించుకుంటూ  బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర  జాతులలో ఏది తన జాతి  ఈ నాలుగు జాతులలో ఏ జాతి గొప్పది  దాని తర్వాత ఏ జాతి అంటూ లెక్కలు వేసుకుంటూ కూర్చోవడం తప్ప  దాని మూలానికి వెళ్లి ఆలోచించేవారు చాలా తక్కువ. సమాజంలో ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి  అని తెలుసుకోవాలంటే  భగవద్గీతలో ఉన్న విషయాలను మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది  గీతాకారుడు చెప్పిన విషయాన్ని బట్టి  వ్యక్తి యొక్క గుణాన్ని  అతను చేసే పనిని దృష్టిలో పెట్టుకొని  అతని  మతాన్ని కులాన్ని ఏర్పాటు చేశారు  తప్ప  వేరే కారణం ఏమీ లేదు అంటాడు సమాజంలో కొంతమందిని మనం చూస్తున్నట్లయితే బాగా ధనవంతుని ఇంట్లో పుట్టిన కుర్రవాడు కూడా ఇంటి నుంచి పారిపోయి బయటకు వెళ్లి తన కడుపు నింపుకోవడానికి ఏ హోటల్ లోనో పని చేయడం  మాట పట్టింపు వల్ల తాను చేసిన ఈ చిన్న పనికి జీవితమంతా  బాధపడే నిర్ణయం తీసుకోవడం  ఆ వయసులో  తెలిసీతెలియని మనసుతో తీసుకున్న నిర్ణయంగా మనం భావించవచ్చు. ఒక వ్యక్తి జీవనోపాధి కోసం  కష్టపడి వ్యవసాయం చేస్తూ  శూద్రుడు అనిపించుకుంటాడు దానిని వ్యాపారం కన్నా మార్చి  ఒకచోట నుంచి మరోచోటకు మార్పిడి చేస్తూ జీవితాన్ని గడిపే వాడిని  వైశ్యుడు అని అంటారు తన గ్రామానికి కానీ తన రాష్ట్రానికి కానీ  దేశానికి కానీ రక్షణ చేసేవాడిని  క్షత్రియులు  అని పిలుస్తారు సమాజానికి పనికి వచ్చే పనులను గురించి ఆలోచించి చక్కటి సూచనలు తెలిసి  బ్రహ్మజ్ఞానం తెలిసిన యోగ్యులను బ్రాహ్మణులు అని చెబుతారు తప్ప  దేశాలన్నీ తిరిగి దాని  మూలాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఏమాత్రం ప్రయోజనం లేదు అంటాడు వేమన  ధ్యానం కలిగిన వాడే ఉత్తమ జాతికి చెందిన వాడు అని నిర్ణయించాడు కూడా   చదవండి  ఆ ఆటవెలది పద్యాన్ని.

"జాతులందు మిగుల జాతి యేదెక్కువో యెరుగలేక తిరుగనేమి ఫలమొ యెరుక గలుగువాడె హెచ్చయిన కులజుండు..."

;

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం