వెర్రి వాడు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆంధ్ర భాషలో పదాల ఎన్నిక ఎంతో అందంగా ఉంటుంది  ఒకే పదానికి నానా అర్థాలు ఉన్న భాష  మన ఆంధ్ర భాష  ఇతర భాషలలో ఒకటికి  రెండు లేక మూడు అర్థాలు ఉండవచ్చు  కానీ ఆంధ్ర భాషకు అనేక అనేక అర్థాలు  సందర్భాన్ని బట్టి  వాడడం మన కవులకు  రచయితలకు వెన్నతో పెట్టిన విద్య  వేమన అనేక సందర్భాలలో అనేక పదాలను అనేక నానార్థాలతో వాడినవి చాలా ఉన్నాయి  వారు రాసిన పద్యాలలో  చాలా పదాలు మనకు దొరుకుతాయి వెతికితే  వెర్రి అన్న శబ్దం వాడినప్పుడు దానికి అర్థం మనకేం వస్తుంది  పిచ్చివాడు మనసు సరిగా పనిచేయని వాడు  ఒకరు చెప్పిన దానిని అర్థం చేసుకోకుండా  అర్థం పర్థం లేని మాటలతో  కాలక్షేపం చేసేవాడిని  వెర్రి వాడుగా వాడాడు  వేమన. ఎంతోమంది ఋషులు తపస్సు చేసి  యజ్ఞ యాగాదులను నిర్వహించి  అనేక వేద అంశాలను  మనకు అందించారు  వేదాలను అధ్యయనంచేయడానికి ఒక జీవితకాలం పడుతుంది  అది కూడా తదేకంగా  మనసును దానిపైనే లగ్నం చేసి  అంకితభావంతో తెలుసుకోవాలి అన్న  కృత నిశ్చయంతో  ఉన్నవాడికి మాత్రమే జ్ఞానోదయం కలుగుతుంది ఆ వేదాలు  మనసులో నిలిచిపోతాయి  అలాంటి వేద శాస్త్ర జ్ఞానం లేక విజ్ఞానం  వెర్రి వాడికి అవసరం అవుతుందా  ఒకవేళ చదవాలన్న కుతూహలం ఉన్నా  చదివినా వాడికి అర్థం అవుతుందా  అది చూసినవారు  దానిని గురించి వెర్రి వాడు వీడికి వేదాలు ఏమిటి  వెర్రి వెదవ వెర్రి వెదవ గానే ఉండాలి  వాడికి తగిన పనులు చేసుకోవాలి  అని ఎగతాళి చేస్తాడు తప్ప ఎవరు ప్రశంసలు కురిపించరు. వివాహ వ్యవస్థలో ఈడు జోడు అన్న పదం  ఎంతో ఆదర్శంగా ఉంటుంది  వరునికి వధువుకి రెండు మూడు సంవత్సరాల వ్యవధి ఉండి  ఇద్దరూ కలిసి  వివాహం చేసుకున్నట్లయితే  దానిని ప్రతి ఒక్కరూ హర్షిస్తారు  వారిని చూసి ఆనందిస్తారు  కానీ సమాజంలో కొంతమంది  భార్య చనిపోయిన తర్వాత  వయసు ఉరిగిన  వయసులో ఉన్న అమ్మాయిని కోరుకుని వివాహం చేసుకుంటారు తన మదంతో  అటువంటి స్త్రీకి ఏమైనా సుఖం ఉంటుందా  సద్ది వనాలు కొట్టే  సరికి సంసారాలు ఎందుకు  అతనికి పూజ పునస్కారాలు ఉంటే కదా  జీవితంలో  ఒక పద్ధతికి అలవాటు పడి  సమయానికి అనుకూలంగా చేసేవాడికి  పూజలు కావాలి తప్ప మిగిలిన వారికి దేనికి  అని ప్రశ్నిస్తున్నాడు వేమన  వారు రాసిన పద్యాన్ని చదవండి.

"వెర్రి మొద్దుకేళ వేదశాస్త్రంబులు  ముద్దులాడికేలా ముసలి మగడు సద్ది మిగుల నింట సంసారమేలరా..."


కామెంట్‌లు