విషయముల పోలిక- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సమాజంలో కొంతమంది వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాం  సమాజంలోనే కాదు మన కుటుంబంలో కూడా మనకు తెలిసిన వ్యక్తులు మనస్తత్వాలను అర్థం చేసుకున్నట్లయితే  పరిశీలనగా చూస్తే మనకు తెలుస్తుంది  ఒక చిన్న కుర్రవాణ్ణి తీసుకోండి  నాకు ఇది ఇష్టం దీన్నే నేను తింటాను అది నాకు చేసి పెట్టండి అది నాకు పని ఇవ్వండి అని అంటాడు తప్ప  అది మంచిదా కాదా అన్న విషయం అతనికి పట్టదు  అది అతని చేతికి వచ్చేంతవరకు  ప్రయత్నం చేస్తూనే ఉంటాడు  కొంచెం వయసులోకి వచ్చిన తర్వాత కూడా  వాటి అభిరుచి నుంచి బయట పడలేదు  తన నాలుక ఏది చెబితే  ఆ రుచిని అనుభవించడం తప్ప మరొకరుచి జోలికి వెళ్ళడు  ఇది మనుషులలో ఉన్న బలహీనత ఒక్కొక్క  ఇంద్రియానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది  ఆ అలవాట్లను తీర్చుకోవలసిన అవసరం శరీరానికి ఉంటుంది. సహజంగా తీర్చుకోవలసిన  ప్రతి కోరిక  తీర్చుకోవలసినదే  కానీ దానికే కట్టుబడి దాని కోసమే జీవించే స్థితి  తన శరీరానికి రాకుండా కాపాడుకునే వ్యక్తులు  అతి కొద్ది మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఆహార వ్యవహారాలలో కానీ  తన జీవిత విధానములో కానీ  సమాజంలో మెలగవలసిన  పరిస్థితులను అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా  నడుస్తున్న మనుషులు కానీ  స్త్రీ పురుషులకు ఎలాంటి భేదాలను  కల్పించిన వారికి ఇవ్వవలసిన గౌరవం వారికి ఇవ్వడం వల్ల  తన వ్యక్తిత్వం పెరుగుతుంది  సమాజంలో తనకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి  కనిపించిన ప్రతి వస్తువును అనుగ్రహించాలి అనుకోవడం  వీరి మనస్తత్వానికి వ్యతిరేకం.వేమన నిత్య జీవితంలో జరిగిన సంఘటనలను  వారి అలవాట్లను మనం గమనించినట్లయితే  వారు చేయని పని లేదు  చెడ్డ అలవాట్లకన్నిటికి బానిస అయిన వాడే  భోగి కాని వాడు యోగి కాలేడు అన్నది  పెద్దలవాక్కు  ఆ నినాదాన్ని రుజువు చేసిన వాడే వేమన  జీవితంలో మానలేను అనుకున్నాంతగా  బానిస అయిన వ్యక్తి  ఆ కట్టడాలను తెంచుకుని బయటపడి  సమాజానికి తన అనుభవాలతో కూర్చిన అద్భుతమైన నీతులను తెలియజేస్తూ ఆ అలవాట్ల వల్ల ఎలాంటి చెడు జరుగుతుందో కూడా మనకు తెలియజేస్తున్నాడు  కనకనే ఈనాడు పల్లె జనులు కూడా  వేమన పద్యాలను అలా చదువుతూనే ఉన్నారు వారి మనసులో ఆ పద్యాన్ని భద్రంగా దాచుకుంటున్నారు కూడా  ఆ పద్యాన్ని మీరు చదవండి.

"విషయముల దెరలి   పొలుపుగ  విషయములంటక మహాత్మువిధమున ధరలో  విష సంసారములనియును విషయములన్నియును గెల్వ వేమన నేర్చున్..."


కామెంట్‌లు