పల్లె సొగసులు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా  మా గ్రామం మొత్తం  ఒక తాటి మీద నడిపి  మా నాన్న  నిర్వహణలో ఇతర దేశాల నుంచి  వచ్చిన ప్రతి వస్తువును తగలబెట్టడం  ముందు తన ఇంటి నుంచి ప్రారంభం కావాలన్న సిద్ధాంతానికి కట్టుబడి  నాన్నకు తెలియకుండా అమ్మ నాయనమ్మ  ఖరీదైన వస్తువులను దాచినా వాటిని వెలికి తీసి  చీరలను మిగిలిన బట్టలను  వస్తువులను రోడ్డు మీద పెట్టేసి  అగ్నికి ఆహుతి చేయడం  ఆ రోజున అందరికీ ఆశ్చర్యం కలిగించింది  మాటలు చెప్పడం తేలిక  కార్యరూపంలోకి వచ్చేసరికి వారి నిజస్వరూపం బయటపడుతుంది  అయ్యో! ఈ వస్తువు నాది చాలా ఖరీదైనదే అన్న  ఆలోచన వస్తే  ఉద్యమం ముందుకు సాగదు అన్నది నాన్న అభిప్రాయం.
1944లో సుబ్బారెడ్డి గణపవరంలో భర్త చనిపోయిన శేషమ్మ కుమార్తెకు జొన్నపాడు మాంధాత రెడ్డి కి ఇచ్చి ఆ రోజుల్లోనే వివాహం చేయించాడు. మొదటినుంచి కట్న కానుకలకు ఆయన దూరం  ఆ మాట చెపితే ఆయనకు అసహ్యం  విజయనగరం ప్రాంతం నుంచి బ్రతుకుతెరువుకి తేలప్రోలు వస్తే వాళ్ళని హీనంగా చూసే రోజుల్లో వాళ్ళ చేత మా ఇంట్లో వంట వండించారు మా నాన్న ఆ రోజు నుంచి రైతులు వారి చేత వంట పనులు కూడా చేయించుకుంటున్నారు. 1949లో భయంకరమైన తుఫాను వచ్చింది  ఎరుకల వారి కుటుంబాలలో చాలా మంది  చనిపోయారు పంట చేలు మొత్తం మునిగిపోయాయి. జీవించి ఉన్న వారిని తీసుకువచ్చి  మా దొడ్డిలో తలదాచుకునేట్లుగా  ఏర్పాటుచేసి భోజన సదుపాయాలని చేశాడు  నాన్న. తెలంగాణ పోరాటం కమ్యూనిస్ట్ ముమ్మురంగా సాగుతోంది నెహ్రూ ప్రధానమంత్రి పటేల్ నాయకత్వంలో హోం మంత్రి నిజాంపై యుద్ధం ప్రకటించి మూడు రోజుల్లో తెలంగాణను వశం చేసుకున్నారు  కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉంది  1951 జనవరి 26వ తేదీన ప్రక్క గ్రామం నుంచి కొంత మంది హరిజన బాలికలు మా ఉన్నత పాఠశాల విద్య  కోసం వస్తూ ఉండేవాడు  వారిలో వాళ్ళలో ఒక పిల్ల శాంతి  చూడడానికి ఆకర్షణీయ్యంగా ఉంటుంది  మా రెండవ వివాహం చేసుకుందామని ఆలోచించి నాన్నతో చెబితే  శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడితే  మీరు మతం మారితే చేసుకుంటాము లేకపోతే లేదు అన్నారు  ఇది క్రైస్తవ సంప్రదాయం  మేం దానికి కట్టుబడి ఉంటాం అంటే  మీ అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలనుకున్నాం తప్ప  మీ కులాన్ని మతాన్ని చూసి కాదు  ఎవరి మతం వారికుంటుంది ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి  అంత మాత్రం చేత మనసులను విడగొట్టడం మంచిది కాదు  అని నాన్న ఎంత చెప్పినా వాడు వినలేదు  దానితో ఆ వివాహం జరగలేదు.

కామెంట్‌లు