పల్లె సొగసులు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ రోజుల్లో మా గ్రామానికి కాలువలు రాలేదు  ధనికులైన రైతులు వారి పొలాల లో  చెరువులు తగించుకొని దానికి సరిపడిన నీళ్లు  పెట్టి వారు వాడుకోగా మిగిలిన నీటిని ప్రక్క వారికి పంపిణీ చేసేవారు అలా పొలాలు పండటానికి చెరువులు ఎంతో దోహదపడుతూ ఉంటాయి  విజయవాడ దగ్గర ప్రాజెక్టు కట్టక పూర్వం పొలాలలో మెట్టపైరు పండించేవారు పెద్ద నూతులు అంటే మోట బావులు అనేవారు వాటిని తోడి ఆ నీటిని  వ్యవసాయానికి ఉపయోగించేవారు  యాతాంతో తోడి నీరు పెట్టడం దాని ప్రత్యేకత  ఆ రోజుల్లో ముఖ్యమైన పంట గోంగూర అదే వాణిజ్య పంట  పండించిన ఆకుకూరలు కూరగాయలు కావిడితో తీసుకువెళ్లి ప్రక్క గ్రామాలలో అమ్ముకుంటూ ఉండేవాడు.
ఏలూరు కాలువ వచ్చిన తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు వచ్చింది ప్లాటుగా ఉన్న భూమిని సదువుని చేసి కట్టుడు పెట్టుకున్నారు చదును గల భూములను ఒకటి రెండు ఎకరాలుగా మాడులు కట్టుకొని  తొలకరి వర్షాలు పడిన తర్వాత రైతులు తమ వ్యవసాయానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు  షాదను తడిపి రెండు మూడు సార్లు దుక్కి దున్నేవారు  చదును చేసే అంతవరకు దాదాపు రెండు మూడు సార్లు దుక్కులు ఉంటాయి  ప్రతి రైతు ఇంట్లోనూ పచ్చి రొట్ట శుభ్రంగా కుళ్లి ఉండేది  ఆ రోజుల్లో ఎకరానికి సుమారు 5 లేక 6 బస్తాలు పంట చేతికి వచ్చేది  కొన్నేళ్లు పోయిన తర్వాత భూమిని ఎకరాకి మూడు నాలుగు సార్లు మెత్తగా దున్ని కాలవనీళ్లు వచ్చిన తర్వాత ఒడ్లు  తీసుకొని వెళ్లి మెత్తగా తయారు చేసిన మడిలో సెంటుకు మూడు మానికలు చొప్పునచల్లుతారు.
అలుకులు చేసినప్పుడు వచ్చిన దిగుబడి కంటే నాటు వేసిన చేలలో దిగుబడి మూడు లేక నాలుగు రెట్లు ఎక్కువగా వస్తుంది అప్పుడు చేలలో పశువుల ఎరువులు మాత్రమే వేస్తూ ఉండేవాడు  రాను రాను రసాయన ఎరువులు వేస్తున్నారు దిగుబడి కూడా 30 నుంచి 35 బస్తాల వరకు వచ్చేది  ఆ రోజుల్లో ఆరు నెలలకు గాని ఒడ్లు తయారై కోతలు కోసం ఒకచోట చేర్చేవారు  అది దీర్ఘకాలిక పంట పూర్వం ఒక వరి మాత్రమే  ఒక పంటనే పండించేవాడు ఈ రోజుల్లో రెండు పంటలు మూడు పంటలు కూడా పండిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో రెండవ పంటగా పెసర మినుము వేస్తారు  అప్పట్లో వారి కుప్ప చుట్టూ ఏడెంటి గజాల వెడల్పున ఉమ్మడి మొడును కోసి కళ్లం తయారు చేసి అక్కడ  ధాన్యాన్ని వేరు చేసేవారు.


కామెంట్‌లు