దేవరల బండారం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సమాజంలో మనం అనేక మతాలను చూస్తూ ఉంటాం  ఒక్కొక్క మతం వారికి  మరికొన్ని చీలికలు ఉంటాయి  ఏ చీలిక వారి పద్ధతి వారికే ఉంటుంది రెండవ పద్ధతి వాడికి నచ్చదు వీరు చేసినదే సరి అయిన పద్ధతి అని నమ్ముతూ  దానిని అనుసరిస్తూ  తన జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.  జంగమ అన్న  శాఖలో ఉన్న వ్యక్తులు  శివుని తప్ప మరొకరిని  పూజించరు  వారి నోట మరొక మాట రాదు  వారి అహార్యాన్ని  ఒకసారి మనం గమనించినట్లయితే  తెల్లటి దుస్తులను ధరించి  తలగుడ్డ చుట్టి  మెడలో హారాలతో పాటు  ఒక సూత్రానికి బంధించిన  శివలింగాన్ని  ధరించి ఇంటింటికి తిరుగుతూ  తన చేతిలో ఉన్న శంఖంతో ఓంకారాన్ని  పలికిస్తూ బిక్షం ఎత్తుకుంటూ ఉంటారు.
యోగి పొంగవులను మనం గమనించినట్లయితే  ముందు తనను తాను స్వాధీన పరచుకొని  ఆ తర్వాత తాను  ఏ భగవత్ స్వరూపాన్ని నమ్ముకుని  ధ్యానిస్తూ ఉంటాడో  ఆ స్వరూపంపైనే మనసు కేంద్రీకరించి  నిశ్చల దృష్టితో  తపస్సమాధికి వెళ్లడం మనం గమనిస్తాం  నిజాయితీగా ఆ యోగి  నిర్మల మనసుతో ధ్యానానికి  అంకితమైతే తప్ప  భగవత్ స్వరూపం సాక్షాత్కరించి  తనకు మోక్షం ప్రసాదించదు అని ప్రతి ఒక్కరు నమ్ముతారు  మనసులో అభిప్రాయం లేకుండా  ఏదో నామ కీర్తనలు చేస్తూ  సహస్ర నామాలు చేసిన  భగవంతునిపై దృష్టి మరల్చనివాడు  భగవంతునికి ప్రీతి పాత్రులు కాదు అన్న విషయం స్పష్టం  నిజాయితీగా చేసే వారికి మరొక దారి తెలియదు అని చెప్తున్నాడు వేమన. జంగమ దేవరాలను  ఎద్దేవ చేస్తూ అసలు శివుడు ఎక్కడ ఉన్నాడో వీడికి తెలుసునా  లింగాన్ని గుండె మీద పెట్టుకున్నంత మాత్రం చేత  ఆ లింగాన్ని ఈశ్వరుడు దొంగలిస్తాడా ఎందుకంత దాపరికం అతని మనసులో నిశ్చలమై ఉన్న భగవత్ స్వరూపం ఈశ్వరునిది  మాత్రమే  అని అతనికి స్పష్టంగా తెలిసినప్పుడు  శివుని ఆకారాన్ని  లింగాకారంలో పెట్టి దానిని ధరించి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ  తన గుండెను స్పర్శించేలా  అంటే తాను మర్చిపోతానేమోనన్న భయం కాక మరేది. హాయిగా మనసులో ఆయన కొంచెం చేసినప్పుడు  ఈ అనవసర పూజలు ఈ ప్రత్యేకమైన ప్రదర్శన అవసరమా అన్నది  వేమన ప్రశ్న. తాను ఆచరించి చూపిన విషయాన్ని పద్య రూపంలో మనకందించారు ఆ  కంద పద్యాన్ని చదవండి.

"బందెరాళ్లతోడ బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడో  యాత్మలింగమేల నర్చించి చూడరో ..."


కామెంట్‌లు