పల్లె సొగసులు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజులలో పరాయి పరిపాలనపై భారతీయుడు గాంధీ గారి నాయకత్వంలో ఎదురు తిరిగారు. అప్పట్లో కల్లు పాకలు ఎక్కువగా ఉండేవి  గాంధీ గారి మాట ప్రకారం వాటిని తీసి వేశారు నాన్న.  అన్ని ఉద్యమాలలోను పాల్గొన్నారు  జస్టిస్ పార్టీకి  బ్రిటిషులు అనుకూల జమీందారుల పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రోజుల్లో  నాన్న వందేమాతరం అంటూ ఎదురు వెళ్లే సమయంలో  అనసూయ అన్న నాన్న స్నేహితురాలు కూడా వందేమాతరం అని  ఆమె కూడా నాన్నతో పాటు జైలుకు వెళ్ళింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత  మా అమ్మను అక్క అంటూ  అప్పటికి ఇద్దరే పిల్లలు వారిని సొంత బిడ్డల్లా చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంది  ఆమెకు ప్రభుత్వం వారు పొలం  ఇచ్చారు. ప్రతినెలా  డబ్బు పంపిస్తున్నారు. ఆమె జీవితం సుఖవంతంగా వెళ్ళిపోతుంది  తరువాత మేమంతా  ఆమెను చూడడానికి అంపాపురం మా గ్రామం పక్కనే ఉన్న గ్రామం  వెళ్లి చూసి ఆమె ఆ విషయాన్ని స్వీకరించి  వచ్చేవాళ్ళం  ఆమె మరణించేంతవరకు కూడా మమ్మల్ని ఎంతో గారాబంగా  తనకు బిడ్డలు లేని లోటును తీర్చుకుంటూ  మమ్మల్ని బిడ్డలుగా భావించి  ప్రవర్తించింది  ఆమె మరణించినప్పుడు  మా అన్నయ్య  దగ్గరుండి కర్మలన్నిటిని నుంచి  ఆమెను మా నాన్నకు రెండో భార్యగా  భావించి ఎన్నో అప నిందలు వేశారు. అయినా వాటిని లెక్కచేయకుండా  ఆమె మా అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెలు లాగా ఉన్నారు  ఎంతో ఆప్యాయంగా జీవితం కొనసాగింది  ఆమెతో గడిపిన కాలం మాకు  చాలా ఆహ్లాదం కలిగించేది. గన్నవరం తాలూకా చిరువాడ గ్రామంలో భర్త చనిపోయిన బాలికకు తన సొంత ఖర్చులతో  తేలప్రోలు దేవాలయం ఎదురుగా 1933లో వివాహం జరిపించారు  తెనాలి తాలూకా దావులూరు గ్రామస్తులకు ఇచ్చి జనాశ్రమంలో ఈ దంపతులను ఉంచి  తన ఖర్చులతో పోషించారు. ఇంటికి రానివ్వరు అన్న పరిస్థితిలో కొన్నాళ్లకు వారి వారి గృహాలకు తీసుకెళ్ళారు.  1937లో కమ్మ కులస్తురాలకి వితంతు వివాహం చేయించారు.  ఎరికా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి భర్త చనిపోయిన మహిళను వివాహం ఆడాడు. రాజారావు మోటాటి రెడ్డి నందివాడ ఎంకారెడ్డి కుమార్తె కస్తూరిని వివాహం చేసుకున్నాడు. కమ్మ కులానికి చెందిన స్వరూప రాణి కాపులైనా దశరధను  వివాహం ఆడింది  శనగల పుల్లయ్య కుమార్తె రెడ్డి కమ్మ అతన్ని వివాహమాడింది.  డ్రైవర్ రెడ్డి హరిజన్ అమ్మాయిని చేసుకున్నాడు తేలప్రోలు  హరిజన్ ఆంథోనీ భర్త చనిపోయిన గొల్లపల్లి అమ్మాయిని వివాహమాడాడు  అవుతూ సుబ్బారెడ్డి  అవుదు సుబ్బారెడ్డి ముస్లింల అమ్మాయిల వివాహమాడాడు  కరణం గారి అబ్బాయి భాస్కరరావు పల్లె కారుల అమ్మాయిని చేసుకున్నాడు ఉయ్యూరు మాధవరెడ్డి డాక్టర్ కమలాదేవి కమలని వివాహమాడాడు. ఇలా అనేక వివాహాలను జరిపించి  కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించింది మా నాన్నగారే.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం