పల్లె సొగసులు;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322

 నాటి కృష్ణాజిల్లా  గన్నవరం తాలూకా లో    ఉన్న పెద్ద గ్రామం  తేలప్రోలు  అక్కడ ధనవంతుల కుటుంబాలలో మాది ఒకటి  ఆరుమళ్ళ కోటిరెడ్డి ఆరుమళ్ళ రంగమ్మలకు  జన్మించిన వాడు  మా నాన్న సుబ్బారెడ్డి  ఒకే కుమారుడు కావడంతో చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచింది మా నాయనమ్మ  బాధ్యతలు లేకుండా తిరిగి  ఉన్న ఆస్తిని పాడుచేసి  తన అవసరాలను తీర్చుకుంటూ ఉండేవాడు  చదువు అంటే గిట్టదు  ఐదవ తరగతి లోనే  తాను బడి మానివేశాడు  అప్పటికే వామపక్ష భావాలతో  ఉన్న గ్రామం మాది  1909 లో  జన్మించిన నాన్న  చిన్నతనం నుంచే తన ప్రజ్ఞా పాటవాలను చూపుతూ పెరిగాడు  ఏకసంధాగ్రహి ఒక్కసారి వింటే చాలు  రెండవసారి చెప్పవలసిన అవసరం లేదు.
మా నాయనమ్మకు ఆర్థిక బలం ఉన్నది కానీ  అంగ బలం లేదు  అప్పట్లో  వజ్రాల గురవా రెడ్డి గారు  మా గ్రామంలో ఉన్న పెద్ద కుటుంబం  ఆయనకు 11 మంది సంతానం  మా అమ్మ సీతారత్నమ్మ  9 మంది అన్నదమ్ముల మధ్య పెరిగింది  ఎంతో ఘోరంగా పెరిగింది  మంచి అందగత్తె  ఆమెను చూసి ఎంతో మురిసిపోయిన మా నాయనమ్మ వారి ఇంటికి వెళ్లి రెండు రోజులు అమ్మ ప్రవర్తనను పనితనాన్ని  గమనించి  పెద్దలతో మాట్లాడి  మీ అమ్మాయి నాకు నచ్చింది  మీరు కట్న కానుకలు ఏమి ఇవ్వనవసరం లేదు  పెళ్లి చాలా ఘనంగా చేస్తాను  అని చెప్పి 600 రూపాయలు ఎదురు కట్నం ఇచ్చి  చిన్నతనంలోనే మా అమ్మ నాన్నల వివాహం చేశారు  మా నాయనమ్మకు మొదటి నుంచి  కులమత భేదాలు ఉండేవి కావు  ఆమె రక్తం పంచుకు పుట్టిన నాన్న  తల్లి ఆశయాలకు అనుగుణంగా ఆదర్శాలను పెంచుకున్నాడు

పల్లెటూరి వాతావరణం  మా గ్రామం మేజర్ మైనర్  పంచాయతీలు ఉన్న  ది  నాకు నలుగురు అన్నడు  పెద్దన్నకు  మా పెద్ద తాత పేరు కోటిరెడ్డి  రెండో వాడికి  చిన్న తాత పుల్లారెడ్డి అని  మా నాన్నకు చాలా ఇష్టమైన వ్యక్తి  వేమన  ఆయన పద్యాలు అన్నీ కంఠస్థం చేసినవాడు  అనేక సందర్భాలలోనూ తన  ప్రసంగాలలోనూ వారి పద్యాలను ఉదహరిస్తూ ఉంటాడు  అందువల్ల మా మూడవ అన్నయ్యకు పుట్టడానికి ముందే వాడి పేరు వేమన అని పెట్టారు  స్నేహితులు ఎద్దేవా చేసేవారు  ఏరా మగవాడు అయితే  వేమన అని పెడతావు  అదే ఆడపిల్ల పుడితే వేమనమ్మ అంటావా అని ఖచ్చితంగా మగ పిల్లవాడు పుడతాడు అని గర్వంగా చెప్పేవాడు  జరిగింది ఆ పేరు ఖాయం అయ్యింది  తర్వాత వచ్చిన వ్యక్తి రామకృష్ణ పరమహంస  అందువల్ల నాలుగో వాడికి రామకృష్ణారెడ్డి పేరు. నేను పుట్టేటప్పటికీ ఏం పేరు పెట్టాలో అర్థం కాని స్థితిలో  ఏ పరిస్థితుల్లోనూ సమాజానికి  సంఘటనలకు కలత చెందకుండా ఆనందంగా ప్రశాంతంగా  జీవితం గడపాలన  ఆలోచనతో బ్రహ్మానంద రెడ్డి అని పేరు పెట్టారు.

కామెంట్‌లు