మట్టి మౌనమై మాట్లాడింది ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు 984930587
 (1)
కోవిద్-19 ప్రపంచ వ్యాప్త ప్రవాహం
ఆ విశ్వమానవ శక్తికే తప్పలేదు లాక్ డౌన్
సామాజిక దూరం శరణుజొచ్చె మనిషిలో
2
బతుకున పలికేది ప్రేమ ఆట 
మనసున గొప్పగా నడిసే తోటది 
గాలిలో తేలినా నేలపైని తేటి పాటేగా 
3
రెక్కలు ముడిసింది ఆశల పక్షి
పూరేకుల వాసన కరువైంది కరోనాతో 
ఇంట్లోనే నాదేశం స్వచ్ఛంద కట్టడి
4
కృతులెన్ని రాసినవో కదా మనసా!
అందాల ప్రకృతిని కాపాడేదే కలం
చెట్టూపుట్టల్లో పాటచుట్టే పదం పా!
5
హిమాలయ ఆకాశాలెంత స్వచ్ఛం, గంగా యమునా నీటి తేట గీతిలా
కాలుష్యం తగ్గేను మనిషి వేటుఆట ఆపితే 
6
ఏ ఒక్కరినో  చూసి నవ్వడం కాదు 

అందరితో కలిసి సంతోషంగా కదులు భాయ్ 
తెలియని పులకింతేదో మనలో...
7
కాలం స్వార్ధ స్నేహల్నీ అర్ధ ప్రేమల్నీ కాల్చేస్తే
అర్ధమయ్యేది మనిషికి
మలిన పొరలెన్ని దాగిందీ ఆ గుండెల
8
కరోనా బందీలో మనిషి
సరే ఇంట్లోనే కదా అనుకుంటే
రోడ్డంతా ప్రయాణంలో అడుగులు
9
మంచి మనిషిని ఆకర్షిస్తుందది మైత్రేగా 
ముళ్ళేమో రక్షణ ఆయుధాలు
అందుకే మెత్తని గులాబీ ఉంది  అందంగా 
10
మేఘం కమ్మిన సూర్యులు కలిసేది
చీకటి మీటిన విద్యుత్కాతులనే 
మనిషి పలకరిపు ఓ గొప్ప అయస్కాంతం
కామెంట్‌లు